22-10-2025 12:00:00 AM
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి
కామారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): క్రీడాకారులకు గెలుపు ఓటమిల ముఖ్యం కాదని క్రీడల్లో పాల్గొనడమే ప్రధానమని భావించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మ న్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిం చిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయ న మాట్లాడారు. క్రీడల్లో పాల్గొని ఓటమిపాలైతే నిరాశ చెందవద్దన్నారు.
భవిష్యత్తు లో జరిగే క్రీడల్లో పాల్గొనెందుకు చొరవ చూపాలని అన్నారు. కామారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల్లో 25 టీంలు పాల్గొన్నట్లు కబడ్డీ నిర్వాహకులు సిహెచ్ రాజు తెలిపారు. ప్రథమ స్థానంలో పిట్లం టీంకు 20వేల నగదు ప్రైజ్ మనీ, ట్రోఫీ, ద్వితీయ స్థానంలో గాంధారి టీం కు పదివేల నగదు ప్రైజ్ మనీ, ట్రోఫీ, తృతీయ స్థానంలోతాడువాయి టీంకు 5 వేల నగదుప్రైస్ మనీ అందజేశారు.
సిహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్రస్థాయి కబడ్డీ ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులు సిహెచ్ రాజు ను క్రీడాకారులు అభినందించారు. టోర్నమెంట్ నిర్వాణ సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టి పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు మనోహర్ రావు, రాజలింగం, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.