24 June, 2026 | 8:27 AM

టీటీడీ వెబ్‌సైట్‌లో పాత తీర్మానాలు

01-07-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : టీటీడీ పాలనలో పారదర్శకత కోసం ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. గత పాలకమండలి తీర్మానాల ను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టించారు. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం 8 బోర్డు సమావేశాలు జరిగాయి. అందులో తీసుకున్న నిర్ణయాలు గోప్యంగా ఉంచడం సరికాదన్న ఈవో భక్తులకు తెలిసేలా వాటిని టీడీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు.