31 March, 2026 | 4:39 PM

విభజన సమస్యలపై కలిసి పోరాడాలి

01-07-2024 12:10 AM

తిరుమలను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : విభజన హామీలపై రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడాలని రవాణశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సు ఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించా రు. తెలంగాణ ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్‌కు కొండగట్టులో స్వాగతం పలికామని పేర్కొన్నారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తు లు ఇబ్బందులు పడ్డారని, ఇకపై అలా ంటి పరిస్థితి రాకుండా చూడాలని టీటీడీని కోరారు. గతంలో మాదిరిగానే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్స్ లేఖలపై దర్శనం కల్పించే విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.