calender_icon.png 7 July, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జుక్కల్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..

06-07-2025 06:14:50 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు(MLA Thota Lakshmi Kantha Rao) జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పిట్లం నిజాంసాగర్ మండలాలు చెందిన కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని చుక్కలు శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, నిజాంసాగర్ మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, మహమ్మద్ నగర్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు సంకు లక్ష్మయ్య, బంగ్లా ప్రవీణ్, ప్రజాపండరి, రాము రాథోడ్, మంద బలరాం, అనీస్, లో కియా నాయక్, ఆకాష్, సవాయిసింగ్, తదితరులు పాల్గొన్నారు.