06-07-2025 06:17:17 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) తన జన్మదినం సందర్భంగా అదివారం రోజు పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామ శివారులోని రామేశ్వర ఆలయంలో శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు వారి సతీమణి తోట అర్చన స్వామి వారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వారి వెంట పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.