06-07-2025 06:12:54 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శివాలయంలో శ్రీ రంగనాయక స్వామి, హనుమాన్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి పురస్కరించుకొని ఆలయాలలో అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.