06-07-2025 06:01:29 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆసిఫాబాద్ డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్(Asifabad Division Electronic Media Press Club) అధ్యక్షుడు కొండపల్లి సాయి కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్ లో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు వోరగంటి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా అనిశెట్టి సదాశివ్, సంయుక్త కార్యదర్శిగా శివ, కోశాధికారిగా మహాత్మ భీం రావు, ప్రచార కార్యదర్శిగా విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా రాజ్ కుమార్, గౌరవ సలహాదారులుగా సహరె రాజు, వెంకేశ్వర్లు, సురేష్, రమేష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు, ముభాషీర్,ఖలీల్, సంతోష్, మినేష్, మొయిన్, ఇర్ఫాన్,అవినాష్, రవి, బిక్కాజి,శ్రీకాంత్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..