06-07-2025 06:11:03 PM
మేడ్చల్ (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్ రావు(Ramchander Rao) నిబద్ధత, అంకిత భావం కలిగిన నాయకుడని రాష్ట్ర నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. 45 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పని చేశారని, బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి పనిచేస్తున్నారన్నారు. బీజేపీలో కార్యకర్తలకు పదవులు వస్తాయి అనడానికి రామచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం నిదర్శనం అన్నారు. కష్టపడిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. రామచందర్ రావు నాయకత్వంలో స్థానిక సంస్థలు, మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.