06-07-2025 06:07:55 PM
ఇందిరమ్మ ఇళ్ళు, తెల్ల రేషన్ కార్డులు మంజూరుకై విజ్ఞప్తి..
హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెంలోని జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని టియూడబ్ల్యూజే(ఐజేయు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy)ని కోరారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్బులో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి త్వరలో ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు,తెల్ల రేషన్ కార్డులు మొదలైన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గుణసురేష్,ఈశ్వర్, నరసింహారావు, శివ, సుధాకర్, సైదులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.