calender_icon.png 27 November, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండవ రోజే క్షేత్రస్థాయిలోకి..

27-11-2025 12:52:00 AM

-జిల్లాలో ఎస్పీ సునిత రెడ్డి మార్క్..

-రౌడీషీటర్లకు తనదైన శైలిలో మాస్ వార్నింగ్

వనపర్తి, నవంబర్ 26 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా ఎస్పీ గా పదవి బాధ్యతలు  స్వీకరించిన రెండవ రోజే సునిత రెడ్డి తనదైనా మార్క్ చూపిస్తున్నారు.  సాధారణంగా ఎస్పీ గా వచ్చిన తరువాత రౌడీ షీటర్ల నేర చరిత్ర వాళ్లు చేసే పనుల గురుంచి తెలుసుకుని పిలిపించి వార్నింగ్ ఇవ్వడం అనేది అందిరికి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా వనపర్తి జిల్లాకు మొదటి రోజు సోమవారం రోజు  పదవి బాధ్యతలు స్వీకరించడం రెండవ రోజు మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో గల రౌడీ షీటర్ల కదలికల పరిశీలన నిమిత్తంలో భాగంగా నేరుగా వారి నివాస గృహలకు వెళ్లి తనదైన శైలిలో ఎస్పీ సునిత రెడ్డి మాస్ వార్నింగ్ ఇవ్వడం తో  జిల్లా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. 

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..

ఎన్నికల సమయంలో ఎవరైనా రౌడీషీటర్లు, వారి అనుచరులు, లేదా ప్రభావిత వ్యక్తులు ప్రజలను బెదిరించడం, గొడవలకు ప్రేరేపించడం, మద్యం, డబ్బుతో ఓటర్లపై ప్రభావం చూపడానికి ప్రయత్నించడం వంటివి తీవ్రమైన నేరాలు. ఇలాంటి కార్యకలాపాల్లో ఎవరైనా పాల్పడితే, వారు ఎవ రైనా కాని కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని  ఎవరెవరితో మర్యాదగా నడుచుకోవాలని ఎవరితో దూరంగా ఉండాలి  అన్న దానిపై స్పష్టమైన హెచ్చరిక జారీ చేస్తున్నానని మర్యాదగా వ్యవహరిస్తే మంచిదని .

చట్టాన్ని అతిక్రమిస్తే సహించేది లేదని  రౌడీ షీటర్లకు ఎస్పీ సునిత రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం విడుదల అయిన గంటల వ్యవది లోనే నేరుగా జిల్లా కేంద్రం లో గల రౌడీ షీటర్ల నివాస గృహలను ఆకస్మిక తనిఖీ నిర్వహించి వార్నింగ్ ఇవ్వడంతో రౌడీ షీటర్ల పరిస్థితి ఇలా ఉంటే అక్రమ వ్యాపారం చేసే వ్యాపారుల అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైనదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఎస్పీ సునీతా రెడ్డి తన మార్క్ ను రెండవ రోజే జిల్లా ప్రజలకు  అర్థం అయ్యే లా చేశారని పలువురు మేధావి వర్గాలు చర్చించుకుంటున్నారు. 

ఎన్నికల వేళ అభ్యర్థుల పరిస్థితి ఏంటి ..? 

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ చెప్పిన విషయం అందరికి తెలిసిందే. చుక్క, ముక్క, నోట్ లేనిదే,  ఎంత పంచితే అంత ఓటింగ్ అన్న స్థాయిలో ఎన్నికలు జరగడం అనేది అందరికి తెలిసిందే. రెండవ రోజే తనదైన మార్క్ ఎస్పీ చూపడం సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే రావడం ఫోటి చేసే అభ్యర్థులకు తలనొప్పిగా మారుతుందని బయటకు చెప్పుకోలేక అంతర్మదన పడుతారని గ్రామాల ప్రజల్లో చర్చ మొదలైంది. 

ఎన్నికలు పూర్తి చేసే దిశగా మా పర్యవేక్షణ

గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అశాంతి కార్యకలాపాలు, బెదిరింపులు, గుంపుగా తిరగడం, దాడులకు ప్రేరేపించడం, ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నాలు కఠినంగా శిక్షార్హులు. చట్టం అందరికీ ఒకటే.  ప్రజల శాంతి భద్రతను కాపాడటం కోసం రాత్రింబవళ్లు పోలీ సులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తారు. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేసే దిశగా మా పర్యవేక్షణ అత్యంత కఠినంగా కొనసాగుతుంది.  ఎన్నికల శాంతి భద్రతను భంగం చేయాలనే ప్రయత్నం చేసే వారిపై  నిఘా కొనసాగిస్తాం.

పోలింగ్ నామినేషన్ కేంద్రాల పరిశీలన

 వనపర్తి క్రైమ్ నవంబర్ 26: గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల నేపధ్యంలో పెద్దమందడి, ఖిద్దమందడి ఘనపూర్ మండలాలలో  ఉన్నా మండల పరిషత్ కార్యాలయాలను పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ రిసీ వింగ్ సెంటర్లను జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ఐపీఎస్. పరిశీలించారు. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియ పవిత్రమైనది. దాన్ని భంగం పెట్టే ప్రయత్నం చేసే ఎవరైనా వ్యక్తి, గుంపు లేదా ఏవైనా రాజకీయ మూలకాలు ఎంత పెద్దవారైనా తక్షణం కఠిన చర్యలు తప్పవు. ప్రతి పోలింగ్ కేంద్రం లో పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు చర్యలు తీసుకున్నాం.

సెన్సిటివ్, హైసెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.

ఎన్నికల సమయంలో బెదిరింపులు, డబ్బుమద్యం పంపిణీ, అనైతిక ప్రలోభాలు, బలవంతపు ప్రచారం వంటి కార్యకలాపాలు గమనించిన వెంటనే దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రజల భద్రత  ఎన్నికల శాంతి  చట్టపరమైన క్రమం మూడు అంశాలపై ఎలాంటి రాజీ లేదు. ప్రజలు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నామినేట్ అవ్వాలి. ఎవరి ఒత్తిడి, ఎలాంటి జోక్యం సహించమని ఎస్పీ  స్పష్టం చేశారు. వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డీఎస్పీ, బాలాజీ నాయక్, కొత్తకోట సిఐ, రాంబాబు , పెద్దమందడి ఎస్త్స్ర, శివకుమార్, ఘనపూర్ ఎస్త్స్ర, వెంకటేష్, డిసిఆర్బిఎస్త్స్ర, తిరుపతి రెడ్డి, పెద్దమందడి ఎంపీడీవో, పరిణత, ఘనపూర్ ఎంపీడీవో, విజసింహారెడ్డి, తదితరులు ఉన్నారు.