calender_icon.png 6 September, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంటినెంటల్‌లో ఓనం సంబురాలు

06-09-2025 01:11:25 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): హైద్రాబాద్ గచ్చిబౌలి నానక్‌రాం గూడలోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో ఘనంగా ఓనం సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఫౌండర్ అండ్ చెర్మైన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

హాస్పిటల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఓనమ్ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని, ఈ పండుగంటే తనకు చాలా ఇష్టమని హాస్పిటల్ చెర్మైన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో హాస్పిటల్‌లోని డాక్ట ర్లు, నర్సులు, ఉద్యోగులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓనం సందర్భంగా నిర్వహించిన డాన్స్, మ్యూజిక్, సింగింగ్, కుకింగ్ పోటీలు అందర్ని అలరించాయి. పోటీల్లో గెలిచినవారికి హాస్పిటల్స్ యాజమాన్యం బహుమతులు ప్రదానం చేసింది.