06-09-2025 01:13:14 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
రాష్ట్ర బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉప్పు విజయ్‌కుమార్
ముషీరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నిక ఎన్నికలకు వెళ్లాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
ఈ మేరకు శుక్రవారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉప్పు విజయ్ కుమార్ ను నియమించి నియామక పత్రాన్ని అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భం గా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దోబూచులాడుతుందని, రిజర్వేషన్లు అమ లు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమించ బడిన ఉప్పు విజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీ యువజన సంఘం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నా రు. తనపై నమ్మకంతో రాష్ట్ర బీసీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణ య్య,
సహకరించిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ జిలపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం వర్కింగ్ రాష్ట్ర ప్రెసిడెంట్ టీ. రాజ్ కుమార్ లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.