calender_icon.png 30 December, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. కోటి నగదు దోపిడీ కేసులో హైమద్ అరెస్ట్

30-12-2025 01:29:38 PM

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station) పరిధిలో జరిగిన రూ. కోటి దోపిడీ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు. ఇండియన్ కెరెన్సీకి క్రిప్టో కరెన్సీ(Cryptocurrency) ఇస్తామంటూ ముఠా కోటి దోచుకెళ్లింది. నిందితులు మెహదీపట్నానికి చెందిన వ్యాపారవేత్తను మోసం చేశారు. నిందితులు కోటి విలువైన క్రిప్టో కరెన్సీ ఇస్తామని తాజ్ దక్కన్ హోటల్(Taj Deccan Hotel)కు పిలిచారు. నగదు తీసుకుని క్రిప్టో ట్రాన్స్ ఫర్ చేస్తామని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. నగదు తీసుకున్న తర్వాత స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. కోటి నగదు దోపిడీ కేసులో నిందితుడైన హైమద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.