30-12-2025 01:41:56 PM
హైదరాబాద్: ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి(Vaikuntha Ekadashi) పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముక్కోటి దేవతలతో కలిసి ఉత్తర ద్వార దర్శనమిచ్చే శ్రీమహావిష్ణువు దివ్యానుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన రేవంత్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆ వైకుంఠ నాథుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Telangana Deputy CM Bhatti Vikramarka) వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. మహా విష్ణువు అత్యంత ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎక్స్ లో పోస్టు చేశారు.