05-06-2025 09:24:35 AM
రెండు గంటలు నిలిచిపోయిన రాకపోకలు.
హుజరాబాద్,(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల(Huzurabad mandal) పరిధిలోని తుమ్మలపల్లి గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ నుండి కరీంనగర్ వెళ్తున్న లారీ, కరీంనగర్ నుండి వరంగల్ కు వస్తున్న లారీలు ఎదురు, ఎదురుగా ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందినట్లు వారు తెలిపారు.
లారీలో ఇరుకపోయిన డ్రైవర్ను గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది సహాయంతో బయటకు తీసి హుజురాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందినట్లు వారు తెలిపారు. కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై(Karimnagar-Warangal main road) రెండు గంటల అంతరాయం ఏర్పడింది. తుమ్మలపల్లి బుజ్జి పై లారీలు నీ కోణంతో వచ్చి పోయే వాహనాలకు అడ్డంగం కలిగింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కరీంనగర్ నుండి వచ్చే బస్సులను సింగపూర్ నుండి మళ్ళించారు. లారీలను జెసిబి సాయంతో పక్కకు తొలగిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.