ప్రారంభానికి సిద్ధమైన స్టీల్ బ్రిడ్జ్
06-08-2026 12:00 AM
పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్
మలక్పేట్, ఆగస్టు 5 (విజయక్రాంతి): నగరంలో మణిహారం లాంటి మరో ఫ్లై ఓ వర్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. చంచల్గూడా- సంతోష్ నగర్ మార్గంలోని స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.
ఈనెల రెండో వారంలో ప్రారంభోత్సవం ఉంటుందని జిహెచ్‌ఎంసి అధికారులు పేర్కొంటున్నారు. బుధవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యే అహ్మద్ బలాల తుది మెరుగు పనులను పరిశీలించారు. జిహెచ్‌ఎంసి కమిషనర కర్ణన్ తుది దశకు చేరుకున్న పనుల గురించి వివరించారు. వీధిలైట్లు, రంగులు, చివరి దశలోని ర్యాంపులు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు.






