calender_icon.png 25 October, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయా నూర్పిడి యంత్రంలో చిక్కుకుని ఒకరి మృతి

25-10-2025 12:05:00 AM

కుభీర్,(విజయక్రాంతి)సోమనాథ్ (34) అనే ఒకరు సోయా పడుతూ ఆయంత్రంలో చిక్కుకుని మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం, పాత సౌంవ్లీ గ్రామంలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సోమనాథ్ సోయా నూర్పిడి యంత్రం ద్వారా రైతుల సోయాలను తీస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటి లాగే శుక్రవారం  గ్రామానికి చెందిన సంతోష్ చేనిలో సోయా నూర్పిడి చేసేందుకు వెళ్ళినాడు. మధ్యాహ్నము సమయం అందాజ రెండు గంటలకి నూర్పిడి యంత్రంలో ఏదో చిక్కుకోవడంతో దాన్ని బయటకు తీసే క్రమంలో సోమనాథ్ ప్రమాదవశాత్తు అందులో చిక్కుకున్నాడు.

అక్కడే ఉన్న కొందరు యంత్రాన్ని ఆఫ్ చేశారు. అప్పటికే తీవ్ర గాయాల పాలన ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. తలకు, నడుముకు, చేతులకు తీవ్ర గాయాలై కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతుండగా అక్కడే ఉన్న గ్రామానికి చెందిన విట్టల్ వెంటనే ఆయన భార్య రుక్మాబాయికి ఫోన్లో సమాచారం అందించారు. ఆమె వెళ్లి చూసేసరికి పెద్దమ్మడుగుల్లో ఉన్న ఆయనను బైసా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కువిరి ఎస్ఐ కృష్ణారెడ్డి కుటుంబీకులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.