27-11-2025 07:35:25 PM
అదనపు కలెక్టర్ నగేష్
పాపన్నపేట (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా సవ్యంగా ధాన్యం కొనుగోలు జరగాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గురువారం పాపన్నపేట మండలంలోని యూసఫ్ పేట్ గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ప్రస్తుత సీజన్ కు ఇప్పటివరకు 63,352 మంది రైతుల నుండి 2,42,104.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.401.69 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. గత సంవత్సరం ఈరోజు నాటికి సన్న ధాన్యానికి ఎలాంటి బోనస్ చెల్లింపు మొదలు కాలేనప్పటికి ఈ సీజన్లో సన్నధాన్యం 5008 రైతులకు రూ.11.56 కోట్ల బోనస్ చెల్లింపు పూర్తి చేశామని తెలియజేశారు. అదనపు కలెక్టర్ వెంట అధికారులు సిబ్బంది ఉన్నారు.