calender_icon.png 17 August, 2025 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవా గుణాన్ని అలవర్చుకోవాలి

17-08-2025 12:26:52 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఆగస్టు 16(విజయక్రాంతి): మానవసే మాధవ సేవ అని, ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం రాంనగర్ లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్భంగా టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు  రావులపాటి మోజస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.

సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకులు రావులపాటి మోజస్ పేద విద్యార్థినీలకు  తమ సహకారాన్ని అందిస్తూ సైకిళ్లు అందజేయడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలలో ముందుంటేనే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహ, వల్లాల శ్రీనివాస్, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు.