17-08-2025 12:27:04 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : వాజ్‌పేయి పాలనను భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పరిగణిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం ప్రపం చంలో అగ్రస్థానంలో నిలిచిందని, ఆర్థికంగా కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాలన ఒక నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ సడక్ యోజన, ప్రధాన మంత్రి స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్ట్ ద్వారా జాతీయ రహదారులు, ఎయిర్‌పోర్టులు వం టి అనేక మౌలిక వసతుల నిర్మాణాలు జరిగాయన్నారు.
పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వ హించిన సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించినా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వ హించిన వాజ్‌పేయి వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి ఒకసారి 13 రోజులు, మరోసారి 13 నెలలు, తర్వాత నాలుగున్నర సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారని బియ్యం, గోధుమల వంటి ముఖ్యమైన ధాన్యాల సరఫరా, ఎగుమతి వ్యవస్థలో మార్పులు ఆయన పాలనలోనే చోటుచేసుకున్నాయన్నారు.
ప్రజలను మభ్యపెడుతున్న రేవంత్
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ లను మరిచిపోయానని ఆయన మండిపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం రేవంత్‌రెడ్డి అబద్దపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. రూ.22,500 కోట్లు కేటాయించి ఇండ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రాష్ర్టంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కడతామని హామీ ఇచ్చిందని, కానీ 19 నెలలు గడిచినా ఇప్పటివరకు ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
నిజమైన పేదలకు ఇండ్లు ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు చింతల రామచంద్రా రెడ్డి , కార్యద ర్శులు డా. ఎస్.ప్రకాశ్‌రెడ్డి, మాధవి, సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌కు రుణపడి ఉన్నాం
స్వయంసేవక్ సంఫ్‌ు ప్రచారకుడిగా తన జీవితం ప్రారంభించి, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరి దేశ ప్రధానిగా కావడం ఆయన అసామాన్య వ్యక్తిత్వా నికి నిదర్శనమన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఆర్‌ఎస్‌ఎస్‌కు మనమంతా రుణపడి ఉన్నామన్నారు. కొందరు ఆర్‌ఎస్‌ఎస్‌పై తప్పుగా మాట్లాడుతున్నారని, కానీ ఆర్‌ఎస్‌ఎస్ భారతదేశంలో పుట్టిన, భారతదేశం కోసం పుట్టిన సంస్థ అని స్పష్టం చేశారు.
విమర్శకుల్లా చైనా, పాకిస్థాన్ ప్రయోజనాల కోసం మాట్లాడే పార్టీ కాదన్నారు. పేదలకు ఇండ్లు కల్పించాలనే సంకల్పంతో వాంబే అనే పథకాన్ని వాజపేయి ప్రారంభించారని, అప్పట్లో దత్తాత్రేయ పార్లమెంట్ సభ్యులుగా ఉండగా, ఈ పథకం కింద అనేక మంది పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారని, ఇప్పటికీ వారు ఆ ఇళ్లలో నివసిస్తూ లబ్ధి పొందుతున్నారని తెలిపారు.