12-08-2025 12:00:00 AM
ప్రజావాణీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హాజరై వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి హామీ ఇచ్చారు డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతా ల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే పిర్యాదు దారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకా రం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.
తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్‌డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.