calender_icon.png 5 July, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుదలతో లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

05-07-2025 01:31:51 AM

ఎస్పీ కె.నరసింహ

సూర్యాపేట, జూలై 4 (విజయక్రాంతి) : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు పట్టుదలతో కృషి చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఇమాంపేట సమీపంలోని తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ బాలికల కళాశాలను  శుక్రవారం సందర్శిం చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వత్తిడికి గురికాకుండా విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. ఈయన  వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్,  ఎస్త్స్ర బాలు నాయక్, పాఠశాల, కళాశాల ఉపాద్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.