calender_icon.png 5 July, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు నిరసనగా.. రోడ్డు మరమ్మతులు

05-07-2025 01:30:06 AM

బీఆర్‌ఎస్ నాయకుల నుంచి వెల్లువెత్తుతున్న ఆరోపణలు

యాదాద్రి భువనగిరి జూలై 4 (విజయక్రాంతి): రోడ్డు మరమ్మతు పనులు తక్షణమే చేపడుతానని హామీ ఇచ్చి పట్టించుకోకుండా  ప్రమాదాలకు ఎమ్మెల్యే కుంభం కారణమయ్యారని టిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.  తామే ప్రజల కోసం రోడ్డు పనులు చేపడతామంటూ  ఆ పార్టీ నాయకులు శుక్రవారం నాడు రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి రోడ్డు మరమ్మత్తులను చేపట్టారు.

భువనగిరి పట్టణము నుండి జగదేవ్పూర్ కు వెళ్లే జాతీయ రహదారి పై ఆర్కే హాస్పిటల్ ముందు గత కొంతకాలంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డుకు ఇరువైపులా పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదకరంగా మారిన ఆ రోడ్డుపై ద్విచక్ర వాహన దారులు పలుసార్లు ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఎన్నో ఉన్నాయి. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలు, తమ పార్టీ నాయకులు పలుసార్లు విజ్ఞప్తి చేశారు.

అయినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే పర్యటనలకి పరిమితం అవుతూ ఉన్నారు తప్ప పనులు చేయడం లేదని విమర్శించారు.  ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కాజా అజీముద్దీన్, నాగారం సూరజ్ ఎండి బుజీబ్ రామకృష్ణ వేముల కృష్ణ మనీష్ పాకల శివ సైదులు బ్రౌన్ శ్రవణ్ విక్రాంత్ వసీం వినోద్ పవన్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.