23-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 22 ( విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో వార్షిక ప్రణాళిక, పాఠ్యప్రణాళిక, బోధన కృత్యాలు, జీవన నైపుణ్యాలు మొదలగు అంశాలపై ఐదు రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం భాగంగా గురువారం జిల్లా రిసోర్స్ పర్సన్ శాంతి కుమార్ ఉన్నత తరగతుల విద్యార్థులకు జీవశాస్త్రం ఎలా బో ధించాలో వివరించారు.
మానవ మూత్రపిండం, గుండె పని చేయు విధానము ఊపిరితిత్తులు పనిచేయు విధానం గురించి ప్రత్యేకంగా గుండె మూత్రపిండము ఊపిరితిత్తులను సేకరించి నమూనాగా మేక అవయవాలను తీసుకొని వచ్చి వాటిని ప్రదర్శించడంతోపా టు వాటి అంతర్ నిర్మాణాలను కోసి ప్రతి ఒక్క భాగాన్ని చూపించి పని చేయు విధానాన్ని జీవశాస్త్ర ఉపాధ్యాయులందరికీ క్లుప్తంగా వివరించారు.
శిక్షణను రాష్ట్ర పరిశీలకులు రామకృష్ణయ్య పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్‌గా శాంతి కుమార్‌తో పాటుగా సమత రిసర్ పర్సన్ గా పాల్గొని పలు అంశాలపై వివరించారు.