23-05-2025 01:58:26 AM
కరింనగర్, మే22(విజయక్రాంతి): కరీంనగర్‌లో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుం డా హిందూ ఏక్తా యాత్రలో జనం బారులు తీరారు.హిందూ ఏక్తా యాత్ర వేదిక వద్దకు విచ్చేసి ప్రజలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివాదం చేస్తూ ముందుకు నడిపించారు. ఈ ఏక్తా యాత్ర లో ముస్లిం యువకులు గజమాలతో సంజయ్‌ని సన్మానించడం కొసమెరుపు. ఏక్తా యాత్రకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి తొలత విద్యారణ్యభారతి స్వామిజీ, అప్పాల ప్రసాద్‌లు ప్రసంగించారు.
ఆనంతతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇంత భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తరలివచ్చిన అందరికీ హ్యాట్సాఫ్ తెలిపారు.మీ ఉత్సాహం, ఆవేశం, జోష్ చూ స్తుంటే సంతోషం పట్టలేకపోతున్నా అన్నా రు.నాలో రక్తం ఉరకలేస్తోంది...రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా అన్నారు.కరీంనగర్ లో ఏక్తా యాత్ర ప్రారంభిస్తే నన్ను హిందూ పిచ్చోడని హేళన చేశారన్నారు.
*ఏక్తా యాత్ర రోజే పోటీ యాత్రలు పెట్టి విచ్చిన్నం చేయాలని చూశారని గుర్తు చేశారు. ఈరోజు బండి సంజయ్ చాలా అద్రుష్టవంతుడని తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే ఎందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు.గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర చేస్తుంటే నాకు గుండెపోటు వచ్చిందని పూర్తి స్ప్రహ కోల్పోయే ముందు నాకు మళ్లీ ఆయుష్షు ఇవ్వాలని అ మ్మవారిని వేడుకున్నానని ఎందుకంటే ఇక నా జీవితాన్ని హిందుత్వం, సనాతన ధర్మం కోసమే బతుకుతానని మొక్కిన*అన్నారు.
అ మ్మవారు కరుణించి మళ్లీ నాకు పునర్జన్మనిచ్చిందన్నారు. అందుకే నా బోనస్ జీవిత మంతా కాషాయ జెండా, సనాతన ధర్మం కోసమేఅన్నారు.అందుకే పాతబస్తీ వెళ్లి సభ పెట్టి కాషాయ జెండా సత్తా చూపిన అన్నా రు.పెహల్గాం ఘటన తరువాత హిందువుల్లో ఐక్యతగా ఉండాలనే ఆలోచన వచ్చి ందన్నారు.మతం పేరు అడిగి బట్టలిప్పి హిం దువని తెలిశాకే చంపేశారన్నారు.
అప్పుడు మోదీ ఏం చేశారో చూశారో తెలుసు కదా అ న్నారు.పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఆ ఉగ్రవాదులకు నా అన్న వాళ్లు లేకుండా చేసిన సైన్యం మనదన్నారు.అమెరికా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా దాడి చేసి 3 వేల మందిని చం పితే... 10 ఏళ్ల దాకా ఏమీ చేయలేదని 10 ఏళ్ల తరువాతే ఒసామా బిన్ లాడెన్ ను ప ట్టుకుని చంపిందని అన్నారు.
కానీ పెహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే ఉగ్రవాదుల అంతు చూసిన సైన్యం నా భారత సైన్యానిదేఆన్నారు.పాకిస్తాన్ పై యుద్దం చిన్నదని త క్కువ చేసిన మల్లికార్జున్ ఖర్గేను బందీ సంజయ్ సవాల్ విసిరారు.పాకిస్తాన్ లోపలకు వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా?. అన్నారు.
పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 11 మిలటరీ బేస్లను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? 20 శా తం మేరకు పాకిస్తాన్ మిలటరీ మౌలికవసతులను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? ఆని ప్రశ్నించారు.మన సైన్యం దెబ్బకు భయపడి యుద్దం ఆపాలంటూ కాళ్లబేరానికి రా వడం చిన్న యుద్ధమా?...ఏది చిన్న యుద్ద మో ఖర్గే సమాధానం చెప్పాలన్నారు.
యు ద్దంలో ఎన్ని మన రాఫెల్ విమానాలు ఎన్ని ధ్వంసమయ్యాయో లెక్క చెప్పాలని రాహు ల్ గాంధీ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.మన సైన్య శౌర్య పరాక్రమాలను పొగడాల్సింది పోయి తక్కువ చేసి చూపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీకి భారత దేశంలో కంటే పాకిస్థాన్ లోనే ఎక్కు వ మంది అభిమానులున్నారన్నారు.ట్రంప్ కు భయపడి మోదీ యుద్దం ఆపేసిండని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు అన్నారు.
కాంగ్రెస్ హయాంలో యుద్దం జరిగితే పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసినప్పుడు పీవోకే ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు.మన దేశంలో అక్ర మంగా నివాసముంటున్న విదేశీయుల్ని దేశమంతటా ఏరివేస్తుంటే మీరెందుకు సైలెంట్ గా ఉన్నరన్నారు.
వాళ్లకు రేషన్ కార్డులు, ఆ ధార్ కార్డులు అందించి సబ్సిడీలు ఇచ్చింది నిజం కాదా అన్నారు.మీకు నిజంగా దేశభక్తి ఉంటే అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల ను, విదేశీయుల్ని బయటకు పంపే దమ్ముం దా అని ప్రశ్నించారు.యుద్దం ఆగిపోలేదు... పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషించినన్నాళ్లు యుద్దం చేస్తూనే ఉంటా మన్నారు.