calender_icon.png 23 May, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి దాతృత్వం

23-05-2025 01:36:52 AM

అసైన్‌మెంట్ భూమి లబ్ధిదారులకు రూ.10 లక్షల సొంత నిధులు అందజేత

కార్యకర్త కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం

పటాన్ చెరు, మే 22 : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలో సీఎస్‌ఆర్ నిధులతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం భూమి అంశంలో నష్టపోతున్న అసైన్మెంట్ భూమి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అండగా నిలిచారు.

గ్రామంలో ఆధునిక వసతులతో పాఠశాల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది లభిస్తుందని భావించి సంబంధిత భూమి లబ్ధిదారులతో చర్చించి పాఠశాల నిర్మాణానికి భూమి ఇచ్చేలా వారిని ఒప్పించారు.

ఈ మేరకు గురువారం గ్రామ పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం ఆవరణలో గ్రామ ప్రముఖుల సమక్షంలో భూమి లబ్ధిదారులు జొన్నాడ మహేష్, జహంగీర్లకు రూ.5 లక్షల  చొప్పున రూ.10 లక్షల  సొంత నిధులు  అందజేశారు. పాఠశాల నిర్మాణానికి భూమి అందించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి అభినందించారు. 

 కార్యకర్త కుటుంబానికి అండగా ఎమ్మెల్యే 

దశాబ్ద కాలంగా తన విజయాల్లో వెన్నింటిగా నిలుస్తూ ఇటీవల మృతి చెందిన రుద్రారం గ్రామానికి చెందిన కురుమ నరసింహులు కుటుంబానికి ఎమ్మెల్యే  అండగా నిలిచారు. గురువారం రుద్రారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే 

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్  చెరు డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయం, చైతన్య నగర్ హనుమాన్ దేవాలయాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన కమిటీల సభ్యులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్,  మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం కమిటీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీలు మన్నె రాజు, హరి ప్రసాద్ రెడ్డి, రామిరెడ్డి, కంకర సీనయ్య, గ్రామ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.