22-05-2025 10:39:34 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి చేయాలని ఇనుగుర్తి మండల విద్యాధికారి రూపా రాణి(Mandal Education Officer Rupa Rani) కోరారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం జడ్పీహెచ్ఎస్ కేసముద్రం స్టేషన్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. మూడో రోజు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రూపా రాణి మాట్లాడుతూ... శిక్షణలో నేర్చుకున్న అభ్యసన సామర్ధ్యాలతో విద్యార్థుల ఉన్నతికి తోడ్పడే విధంగా కృషి చేయాలన్నారు.
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నిర్వహించడానికి కృషి చేయాలని, అదే విధంగా రాబోయే బడిబాట కార్యక్రమంలో ఇనుగుర్తి మండలంలో ఉన్న గ్రామాల్లోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీలు సూరం భాస్కర్ రెడ్డి, బోనగిరి రాములు, భాస్కర్, సత్యనారాయణ, సురేష్ నాయుడు, భాస్కరరావు, అశోక్, యాదగిరి, కృష్ణ పాల్గొన్నారు.