calender_icon.png 20 December, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటేస్తేనే ప్రజాస్వామ్య ఫలాలు

15-12-2025 12:49:57 AM

స్వపరిపాలనకే పంచాయితీ ఎన్నికలు

గ్రామ స్వరాజ్యమే బాపూజీ కన్న కలలు

గ్రామాలు బాగుంటే నగరాలు బాగుంటై

గ్రామాలే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు

                    ***

అలవికాని హామీలు గుప్పిస్తారు

ఓటుకు నోటని ఆశ చూపిస్తారు

అధికారమే ముద్దు రాజకీయులకు

గద్దెనెక్కాక ముఖం చాటేస్తారు

                    ***

ఓటనేది రాజ్యాంగం నీకిచ్చిన హక్కు

ఓటేస్తేనే ప్రజాస్వామ్య ఫలాలు దక్కు

ఇంటిలో కూర్చునే దేశాన్ని నిందించకు

నీ ప్రయత్నం చెయ్ ఆపై దేవుడే దిక్కు

 సింగారపు రాజయ్య