20-12-2025 01:59:55 AM
25 వరకు కస్టడీ పొడిగింపు
జనవరి 16కు తదుపరి విచారణ వాయిదా
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 19 (విజయక్రాంతి) : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ స్పెషల్ ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావుకు మరోసారి భంగపాటు తప్పలేదు. దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని సిట్ చేసిన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ప్రభాకర్‌రావు కస్టడీని మరో వారం రోజుల పాటు.. డిసెంబర్ 25 వరకు పొడిగిస్తూ శుక్రవారం సంచలన ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టి స్ మహదేవన్ ధర్మాసనం ఎదుట తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీని యర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వినిపించిన వాదనలు సంచలనం రేపాయి.
కేవలం రాజకీయ నాయకులే కాదు.. నక్సలైట్ల పేరు చెప్పి అనే క మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందులో జడ్జీలు, వారి డ్రైవ ర్లు కూడా ఉన్నారు అని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది రాజకీయ సమ స్య కాదు.. పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన తీవ్రమైన అంశం. ప్రభుత్వ పెద్దలు ఎవరినైనా కాల్చమని చెబితే కాల్చేస్తారా అని ప్రభాకర్ రావు తీరును ప్రశ్నించారు. ‘పోలీస్ కస్టడీలో ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు.
డివైజ్లలో ఎలాంటి సమాచారం లేకుండా ముందుగానే ధ్వంసం చేశారు. ఐక్లౌడ్, జీమెయిల్ డేటా కూడా డిలీట్ చేశా రు. అందుకే మరో వారం కస్టడీ కావాలి’ అని కోరారు. క్యాన్సర్ పేషెంట్‌ను వేధిస్తున్నారని.. ప్రభాకర్‌రావు తరఫున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రి నాయుడు, రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. సిట్ తీరును ఆ న్యాయవాదులు తప్పుబట్టారు. ‘ప్రభాకర్‌రావు 69 ఏళ్ల వృద్ధుడు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు.
ఆయన పట్ల కనీస మానవత్వం చూపడం లేదు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకధాటి గా విచారిస్తూ వేధిస్తున్నారు’ అని వారు ఆవేదన వ్యక్తంచేశారు. తనకు వ్యతిరేకంగా తానేసా క్ష్యం చెప్పేలా ఒత్తిడి తెస్తున్నారని. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21 ఉల్లంఘన అని వాదించారు. ఇప్పటికే 17 సార్లు పిలిచి 96 గంటలకు పైగా విచారించారని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సిట్ వాదనలతో ఏకీభవించింది.
ప్రభాకర్‌రావు కస్టడీని మరో వారం రోజులు పొడిగిస్తు న్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 25 వరకు ఆయన సిట్ అదుపులోనే ఉండాలని, డిసెంబర్ 26న ఆయనను విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణ పేరుతో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్ద ని.. అరెస్ట్, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చేపట్టవద్దని సిట్‌కు స్పష్టంచేసింది. తదుపరి విచారణ ను జనవరి 16కు వాయిదా వేసింది.
ప్రభాకర్‌రావు ల్యాప్‌టాప్, ట్యాబ్, ఫోన్లలో డేటా మొత్తం డిలీట్ కావడంతో.. సిట్ ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదికపైనే ఆశలు పెట్టుకుంది. ఈ వారం రోజుల కస్టడీలోనైనా ఆయన నోరు విప్పించేందుకు, ధ్వంసమైన సాక్ష్యాధారాలకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించనున్నారు.