20-12-2025 02:04:44 AM
సన్నధాన్యం 28 లక్షలు.. దొడ్డు ధాన్యం
30 లక్షల మెట్రిక్ టన్నులు
77.33 శాతం పూర్తి
రూ. 12,684 కోట్లు రైతుల ఖాతాల్లో జమ
హైదరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి) : వానాకాలం వరిధాన్యం రికార్డు స్థాయిలో కొనుగోలు జరిగింది. ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అక్టోబర్ నుంచి ప్రారంభమైన ధాన్యం సేకరణ.. దాదాపు 77.33 శాతం వరకు పూర్తయింది. మిగ తా ధాన్యం కూడా త్వరితగతిన పూర్తిచేయాలనే సంకల్పం తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 8,443 కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సీజన్‌లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నది. వానాకాలంలో 65.69 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేయగా, 159.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగా ముందుగా 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో.. అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నది.
అందుకు సన్నరకం, దొడ్డురకం ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్, ఐకేపీ, ఇతరులకు కొనుగోలు సెంటర్లను కేటాయించింది. ఈ సెంటర్ల నుంచి రాష్ట్రంలోని దాదాపు 121 లక్షలకు పైగా రైతుల నుంచి 58 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించగా.. ఈ వరి ధాన్యంలో సన్నధాన్యం 28 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డుధాన్యం 30 లక్షల మెట్రిక్ టన్ను ల వరకు సేకరించారు.
పౌరసరఫరాల శాఖ లక్ష్యం మేరకు అక్టోబర్‌లో 6.89 లక్షల మెట్రిక్ టన్నులు, నవంబర్‌లో 32.95 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెబంబర్ నెలలో 27.03 మెట్రిక్ టన్నులతో కలిపి ఈ మూడు నెలల్లో మొత్తం 64 లక్షల టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్‌గా పెట్టుకున్నది. అయితే రెండు నెలల క్రితం మెంథా తుపాన్ కారణంగా ధాన్యం సేకరణ ఆలస్యమైం ది. నవంబర్ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు ఊపందుకున్నది.
ఈ నెలాఖరులోగా లక్ష్యం పూర్తిచేసేందుకు అధికారులు సేకరణలో వేగంపెంచారు. మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తిచేస్తే మూడు నెలలకు సంబంధించిన కోనుగోలు లక్ష్యం పూర్తయినట్లు అవుతుం ది. ఇక ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమఅవుతు న్నాయి. ఇప్పటివరకు రూ. 12,684 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి.
అదేవిధంగా సన్న ధాన్యానికి క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ కూ డా.. ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నది. గతంలో బోనస్ నెలల తరబడి జమ కాకపోవడంతో రైతుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా యి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బోనస్ విషయంలో ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నది.
పక్క రాష్ట్రాల నుంచి రాకుండా కట్టడి..
రాష్ట్రంలో సన్నవరి ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తుండటంతో.. చాలా మంది దళారులు పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి సన్న వరి ధాన్యం తీసుకొచ్చి రాష్ట్రంలో విక్రయించేందుకు ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూల్, కృష్ణా జిల్లాల నుంచి ధాన్యం రాత్రి వేళల్లో తీసుకొచ్చి తెలంగాణ సరిహద్దు జిల్లాలలోని కొనుగో లు కేంద్రాల్లో అమ్మకాలు చేశారు.
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి సన్నధాన్యం రాకుండా కట్టడి చేసింది. ఏపీలో మద్దతు ధర సాధారణ రకం క్వింటాకు రూ. 2,369, గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ. 2,389 ఇస్తున్నారు. బోనస్‌లాంటి పథకం ఏపీలో లేకపోవడం..
తెలంగాణ లో క్వింటాకు రూ. 500 బోనస్ ఇవ్వడంతో పెద్దమొత్తంలో ధాన్యం తీసుకొచ్చే ప్రయత్నంచే యగా, సంబంధిత శాఖ అధికారులు కట్టడి చేశా రు. జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల పహారా, సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రతి వాహనం తనిఖీ చేయడంతో దళారుల ఆటలు సాగలేదని, దీంతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బోనస్ డబ్బులు ఇక్కడి రైతులకే చెందుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
12 జిల్లాల్లో కేంద్రాల మూసివేత..
వానాకాలం సీజన్‌లో వరిధాన్యం కొనుగోలు టార్గెట్ దగ్గరపడటం, చాలా ప్రాంతాల్లో వరిధాన్యం కొనుగోలు పూర్తి కావడంతో.. 12 జిల్లా లలో కొనుగోలు కేంద్రాలను కూడా మూసివేశారు. ముందుగా నిజామాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, సిద్దిపేట, కరీంనగర్, జనగాం, మహబూబ్‌నగనర్, మంచిర్యాల, సంగారెడ్డి, జగిత్యాలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కావడం.. ఆయా జిల్లాల లో ధాన్యం సేకరణ పూర్తి కావడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేశారు.