31-12-2025 01:21:40 AM
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జన నాయకుడు’. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న విజయ్ సినీ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీ. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ‘ఒక పేరే అలరారు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ పాటను తెలుగులో శ్రీనివాస మౌళి రాయగా.. శ్రీకష్ణ, విశాల్ మిశ్రా ఆలపించారు. పాటకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి.