31-12-2025 01:22:55 AM
తన ప్రత్యేకమైన కథా ఎంపికలు, శక్తివంతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన ఆరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫా ర్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ విష యాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సిద్ధు, సితార కలయికలో గతంలో వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు భారీ విజయం సాధించాయి.
ఇప్పుడు వారు హ్యాట్రిక్ కోసం సన్నద్ధమవుతున్నారు. స్వరూప్ ఆర్‌ఎస్‌జే ఈ చిత్ర కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధును కొత్తగా, గాఢమైన, వినోదాత్మక మైన అవతారంలో చూడబోతు న్నామని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.