calender_icon.png 30 December, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకు నచ్చితే పూర్తిగా సరెండర్ అయిపోతా

30-12-2025 12:00:00 AM

రష్మిక మందన్నా కెరీర్ పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపో తోంది. తెలుగు, హిందీ సిని మాలతో బిజీగా మారుతోంది. ఇటీవలే లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కూడా ప్రారంభించిందీ ముద్దుగుమ్మ. ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో ప్రేక్షకుల్ని అలరించిన నేషనల్ క్రష్ త్వరలో మరో కథానాయిక ప్రాధాన్య చిత్రం ‘మైసా’తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా కూడా అం చనాలు అందుకుంటే రష్మిక ఇమేజ్ మరో స్థాయికి వెళ్లడం నల్లేరు మీద నడకే అంటున్నారు సినీ విమర్శకులు.

ప్రస్తుతం రష్మిక కొత్త ప్రాజెక్టుల విష యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. కథా బలం, పాత్రలకు ప్రా ధాన్యత ఉంటేనే సైన్ చేస్తోంది. తద్వారా తన పాన్ ఇండియా ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం పడకూడదని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ విషయంలో తనకంటే ఎక్కువగా దర్శక, రచయితలనే నమ్ముతున్నట్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. “నేనొక నటినని, ఎంటర్‌టైనర్‌ననే విషయం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొనే పనిచే స్తా. ఒకే ఇమేజ్‌కు పరిమితం కాకుండా సినిమాలు చేయా లనుకుంటా.

నాలోని విభిన్న వ్యక్తిత్వాలు, కోణాలను అన్వేషించాలనుకుంటా. పాత్రలపరంగా నన్ను కేవలం మంచి అమ్మాయిగానో, అమాయక మహిళగానో, సరదాగా ఉండే ఆడపిల్లగానో, చెడ్డ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగానో చూడకూడదని కోరుకుంటా. ప్రేక్షకుల గుర్తింపు కోసం ఎలాంటి పాత్రలు చేయడానికి నేను సిద్ధంగా ఉంటా. నన్ను నమ్మి దర్శక, రచయితలు రాసే పాత్రల విషయంలో నాకన్నా ఎక్కువగా వాళ్లనే నమ్ముతా. వాళ్ల ఆలోచనకు తగ్గట్టునే నటిస్తా.. అందుకోసం ఎంత మాత్రం వెనుకడుగు వేయను.

నాకు నచ్చితే, నమ్మకంగా అనిపిస్తే దర్శక, రచయితలకు పూర్తిగా సరెండర్ అయిపోతా. అలాగే నేను ఎన్నడూ కేవలం ఒకే భాషకు పరిమితం కాదు. కథలు నచ్చితే భాషతో పని లేకుండా నటించడానికైనా సిద్ధమే. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం.. ఏ పరిశ్రమనూ తేలికగా తీసుకోను. ఏ భాషలో సినిమా చేస్తున్నా ఆ భాషకు అంకితమై పని చేస్తా. ఇంతవరకూ అయి ష్టంగా ఏ సినిమాకూ పని చేయలేదు.

భారతీయ చిత్ర పరిశ్రమలో గొప్ప ప్రయాణం సాధ్యమైందంటే.. కారణం అన్ని భాషల వారూ నన్ను ఆదరించడమే కారణం” అని చెప్పు కొచ్చింది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘కాక్ టెయిల్ 2’లో నటిస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది.