calender_icon.png 5 January, 2026 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో శారీరక–మానసిక ఉల్లాసం

03-01-2026 09:05:57 PM

బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం

వాంకిడి,(విజయకాంతి): క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. సంక్రాంతి  పురస్కరించుకొని  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మైదానంలో నిర్వహిస్తున్న ఓపెన్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను వెలికితీయడం, యువకుల్లో ఐక్యత, స్నేహబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా ‘ఖేలో ఇండియా’ స్ఫూర్తితో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.