calender_icon.png 9 May, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రం ప్రారంభం

03-03-2025 01:27:11 AM

ఖమ్మం, మార్చి 2 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 29వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర ఉపేందర్ తో కలసి ప్రముఖ వైద్యులు శీలం పాపారావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ సైదేశ్వర్ రావు గుర్తుగా కుమారుడు చైతన్య సాయి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు . రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో దడల రఘు, చింతల వెంకన్న , అందెల సాయి , పత్తికొండ శ్రీను , ఆవుల ఉపేందర్ , మంగ, చైతన్య, సాయి  ధనలక్ష్మి, రఘుపతీ , సైదన్న రావు , ఎం.కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.