08-05-2025 01:18:36 AM
-బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
కరీంనగర్, మే 7 (విజయక్రాంతి) : పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడితో భారతీయుల రక్తం మరిగిందని , భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని తొలగించిన ఉగ్రవాదులకు “ఆపరేషన్ సింధూర్ “తో ఇండియన్ ఆర్మీ దీటుగా బదులిచ్చిందని, ఉగ్రముకల పీచమని చేల భారత ఆర్మీ మెరుపు దాడులు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఆపరేషన్ సింధూర్ దేశానికే గర్వకారణమని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ఆర్మీ చేపట్టిన మెరుపు దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మీడియా కన్వీనర్ కటకం లోకేష్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, బిజెపి నార్త్ జోన్ ప్రెసిడెంట్ పాదం శివరాజ్ ఈస్ట్ జోన్ ప్రెసిడెంట్ అవదుర్తి శ్రీనివాస్, చిట్టిబాబు, మాసం గణేష్, రాము బత్తిని మహేష్ గౌడ్, పైడి ప్రసాద్, ఆవునూరు భరత్, కొలిపాక అరవింద్, గడ్డం సందీప్, నిఖిల్, మధు తదితరులు పాల్గొన్నారు.