calender_icon.png 9 May, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుజాతపై చర్యలు తీసుకోవాలి

08-05-2025 01:17:35 AM

బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్‌ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాష్ర్ట విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమెపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, ధన్‌పాల్ సూర్యనారాయణ బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.

ఇది ముమ్మాటికీ దేశద్రోహమేనని అన్నారు. కులమతాలకు అతీతంగా భారతీయులంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే.. ఇలాంటి అర్బన్ నక్సలైట్లు జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారని విమర్శించారు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేసి, రాష్ర్ట విద్యా కమిషన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.