calender_icon.png 9 May, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి హెచ్చరిక

08-05-2025 12:00:00 AM

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, మే 7 (విజయక్రాంతి): భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను చేపట్టి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఉగ్రవాద సంస్థలపై దాడులు నిర్వహించడం ఉగ్రవాదానికి హెచ్చరిక లాంటిదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లోని మూడు ఉగ్రవాద సంస్ధలకు చెందిన తొమ్మిది శిబిరాల్లో దాక్కున్న టెర్రరిస్టులను పెద్దసంఖ్యలో ఆపరేషన్ సింధూర్ ద్వారా హతమార్చిన భారత సైన్యానికి అభినందనలు తెలిపారు.

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర వాదుల ఏరివేతకు భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను చేపట్టడం పట్ల దశప్రజలంతా గర్వపడుతున్నారని, ఉగ్రవాదా న్ని ఉక్కుపాదంతో అణచివేసేలా చర్యలు తీసుకోవాలంటూ సైన్యానికి ఆదేశిచాడం ద్వారా ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపే త నిర్ణయం ప్రపంచానికే దిక్సూచిగా నిలువనుందన్నారు.

భారతీయులకు హాని తలపె ట్టాలని చూసే దుష్ట శక్తులను మోదీ ప్రభు త్వం ఎట్టి పరిస్దితుల్లోనూ వదిలిపెట్టదని, వాటి అంతు చూస్తుందని ఆపరేషన్ సింధూ ర్ ద్వారా ప్రధాని మరోసారి నిరూపించారని కొనియాడారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతకు దిగిన భారత సైన్యానికి, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధానికి అండగా దేశప్రజలంతా  నిలబడాల్సిన సమయమిదని పేర్కొన్నారు.