calender_icon.png 8 May, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాళ్ల వానకు నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలి

08-05-2025 12:00:00 AM

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి, మే 7 (విజయ క్రాంతి): అకాల వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను, కల్లాలలో తడిసిన వడ్లను బుధవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పరిశీలించారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని  అడ్లూర్, చిన్న మల్లారెడ్డి, తలమడ్ల గ్రామాల్లో వడ్ల కల్లాల వద్దకి వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులకు భరోసా కల్పించారు.

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లు యజమానులు ధాన్యాన్ని రైతుల ధాన్యాన్నికొనుగోలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల ఇంకా కోత కానీ వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని,  నష్టపోయిన పంటకి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలనీ డిమాండ్ చేశారు.

అధికారులు పంట నష్టం పై నివేదిక ఇవ్వాలనీ కోరారు. కల్లాలలోతడిసిన సంచులను రైస్ మిల్లర్లు దించుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా కాంట పూర్తి చేయాలనీ అన్నారు. తూకం వేసిన వడ్లు సాధ్యమైనంత తొందర రైస్ మిల్లులకు తరలించాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు మహేష్, రాజు పాటిల్,  రాజేశ్వరరావు, నారాయణ రావు ,భూమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.