06-08-2025 01:22:42 AM
* దైవభూమి అని పేరున్న ఉత్తరాఖండ్ రాకాసి వరదలతో మరోసారి ఉలిక్కిపడింది. ఉత్తర కాశీలో సునామీ వచ్చిందా లేక సముద్రం ఏమైనా మీద పడిందా అన్న స్థాయిలో మేఘం గర్జించింది. ఆ గర్జనకు నీరు, అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరదలా మారి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీని పూర్తిగా కప్పేసింది.
అత్యంత రమ్యమైన ప్రదేశంగా పేరు పొందిన ధరాలీ ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. వరదల ధాటికి బలమైన కొండచరియలు విరిగిపడటంతో చాలా మంది గల్లంతవ్వగా.. సహాయక చర్యలు చేపట్టాల్సిన ఆర్మీ జవాన్లు మిస్సవడం కలచివేస్తుంది. రెప్పపాటులో చోటుచేసుకున్న జల ప్రళయంతో ధరాలీలో ఎటు చూసినా గుండెను పిండేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి.
వారణాసి, ఆగస్టు 5: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఖీర్‌గఢ్ నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం (క్లౌడ్ బరస్ట్) కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. ఈ వరద ఒక్కసారిగా సమీపంలోని ధరాలీ గ్రామంపై విరుచుకుపడి జల ప్రళయాన్ని సృష్టించింది. ఈ విపత్తులో ఇప్పటివ రకు ఐదుగురు మృతి చెందగా.. వంద మం దికి పైగా గల్లంతయినట్టు తెలుస్తోంది.
వరదల ధాటికి భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. ఊహించని జలప్రళయంతో ప్రజ లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. అయితే వరదల కారణంగా 20 నుంచి 25 హోటళ్లు, హోమ్ స్టేలు కొట్టుకుపోయాయి. ఉదయం ఘటన మరువక ముందే మంగళవారం సాయంత్రం రెండోసారి వరదలు జల ప్రళయం సృష్టించాయి. ఉత్తరాఖండ్‌లోని సుఖి ప్రాంతంలో జల విధ్వంసం జరిగింది.
క్షణాల్లో ధార్చులెేగుంజి మార్గం, గస్కు, మల్ఘాట్ ప్రాంతాల్లోని రోడ్లు అడ్డంగా చీలిపోయాయి. సమాచారం అందుకున్న ఐటీబీపీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశాయి. ప్రస్తుతం భారత ఆర్మీ 150 మంది సభ్యుల బృందం, ఎన్డీఆర్‌ఎఫ్‌తో కలిసి నిరాటంకంగా సహాయక చర్యలు కొనసాగి స్తోంది.
ఎక్కడికక్కడ బురద మేటలు వేయ డం, ఇళ్లు, దుకాణాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడు తోంది. వరదలతో చాలా ఇళ్లు కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపో వడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా సహాయక చర్యల్లో భాగంగా ఐటీబీపీ ఇప్పటివరకు 37 మందిని రక్షించారు. ఇందులో 22 మంది పరుషులు, 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు.
ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధరాలీలో వరద బీభత్సం చాలా బాధాకరమ న్నారు. ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.
పది మంది ఆర్మీ జవాన్లు గల్లంతు
ఉత్తరకాశీలో వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. దీంతో జేసీవో సహా 10 మం ది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. వారి కో సం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. వరదకు తీవ్ర ప్రభావితమైన ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం లోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూడా సిద్ధమైంది. ఛండీగడ్ ఎయిర్‌బేస్ నుంచి చినూక్ ఎంఐ వీ5, చీతా, ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లను స్టాండ్ బైగా ఉం చింది. ఉన్నతాధికారుల ఆదేశాలు
అందరూ క్షేమంగా ఉండాలి: ప్రధాని మోదీ
ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన జలప్రళయంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో ఫోన్‌లైన్‌లో మాట్లాడిన మోదీ స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామాన్ని వరదలు ముంచెత్తడం విచారకరమన్నారు. బాధితులంతా క్షేమంగా ఉండాలని కోరకుంటున్నట్టు మోదీ తెలిపారు. ఇక ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. సీఎం పుష్కర్‌కు ఫోన్ చేసిన అమిత్ షా స్థానిక పరిస్థితులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.
ఆ ఇద్దరు చిరంజీవులు..
ఉత్తరకాశీ జలప్రళయం సృష్టించిన విధ్వంసంలో చాలా ఇళ్లు కొట్టుకుపోగా.. దాదాపు 60 మందికి పైగా గల్లంతైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు స్థానికులు మాత్రం బురద విలయాన్ని తట్టుకుని తమ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. జలప్రళయం తర్వాత బురద మయంగా మారిన ధరాలీ ప్రాంతంలో ఒక వ్యక్తి మెల్లిగా నడుచుకుంటూ సురక్షిత ప్రాంతంవైపు అడుగులు వేస్తూ వచ్చాడు.
కానీ నడవడానికి ఓపిక లేకపోవడంతో కిందపడిపోయాడు. ఆ తర్వాత శక్తినంతా కూడదీసుకొని పాకుకుంటూ ఒక చెట్టు సహాయంతో మొత్తానికి ఎత్తు ప్రాంతానికి చేరుకున్నాడు. ఇదే సమయంలో మరో వ్యక్తి మాత్రం బురదలో నుంచే నడుచుకుంటూ వచ్చి సాఫీగా ఎత్తు ప్రాంతానికి చేరడం కెమెరాలకు చిక్కింది. ఈ సమయంలో వీడియో తీస్తున్న వాళ్లంతా.. ‘పరిగెత్తండి.. పరిగెత్తండి’ అంటూ అరవడం కనిపించింది.
మరుభూమిగా ధరాలీ
ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం తాజా వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఖీర్ గఢ్ నదీ ఎగువ ప్రాంతాల్లో భారీ వ ర్షాలు కురిశాయి. దీంతో వరద నీ రు, మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరద ధరాలీని కప్పేసింది. దీంతో ప్రకృతి రమ్యమైన ధరాలీ ప్రాంతం మరుభూమిగా మారిపోయింది. చా ర్‌ధామ్ యాత్రికులు ఎక్కువగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు.
ఉత్తరాఖండ్‌లో మారుమూల ఉన్న అత్యంత రమ్యమైన ప్రదేశాల్లో ధరా లీ ఒకటి. దీని సమీపం నుంచే భాగీరథి నది ప్రవహిస్తోంది. సముద్ర మట్టానికి దాదాపు 2,680 మీటర్ల ఎత్తులో ధరాలీ ప్రదేశం ఉంది. ఇక్కడి నుంచి గంగోత్రి ధామ్ కేవ లం 20 కిలోమీటర్ల దూరం. చార్‌ధామ్ సహా ఇతర తీర్థయాత్రల సీజ న్లలో ధరాలీకి సందర్శకులు పోటెత్తుతారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో లాడ్జీ లు, అతిథి గృహాలున్నాయి.
ధరాలీ సమీపంలోని హార్సిల్ లోయలో భారీ విస్తీర్ణంలో యాపిల్ తోటలున్నాయి. కేదార్ తాల్ ప్రదేశానికి ట్రెక్కింగ్‌కు వెళ్లేవారికి ధరాలీ బేస్‌క్యాంప్‌గా ఉంటుంది. అతి తక్కువ సమయంలో అత్యంత తీవ్రమైన వ ర్షపాతం నమోదు కావడాన్ని క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. అంటే గంటలోపూ 20 నుంచి 30 కి.మీ. పరిధి లో 10 సె.మీ. పైగా వర్షం కురుస్తుం ది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1970 నుంచి 2016 వరకు 30 క్లౌడ్ బరస్ట్‌లు సంభవించాయి.