calender_icon.png 6 August, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరితెగించి.. భూ దందా!

06-08-2025 01:31:29 AM

తల్లీ కొడుకుల కిడ్నాప్.. ప్రాణాలు తీస్తామని బెదిరించి భూమి రిజిస్ట్రేషన్!

  1. డీజీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు 
  2. విజయక్రాంతి’కి వినతిపత్రం

హైదరాబాద్, ఆగస్టు ౫ (విజయక్రాంతి): చలువగాలి రాఘవేందర్‌రాజు అనే వ్యక్తి తమను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి, బలవంతంగా ౩.౦౫ ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని.. బయటికి చెపితే చంపుతామని భయబ్రాంతు లకు గురిచేస్తున్నాడని బాధితురాలు పాలా ది కళావతి, తన కుమారులు పాలాది శ్రీనివాసులు, రాంబాబులతో  కలిసి ‘విజయ క్రాంతి’ దినపత్రికను ఆశ్రయించారు. స్థాని క పోలీసులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని విజయక్రాంతి చైర్మన్ సీఎల్ రాజంకు వినతిపత్రాన్ని అందించారు.

బాధితురాలు కళావతి ‘విజయక్రాంతి’తో తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘మాకు మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలోని పాలకొండ గ్రామంలో సర్వే నంబర్ ౨౭౨లో ౭.౩౦ ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో అప్పట్లోనే జీపీ లేఅవుట్ ప్లాట్ల ను నా భర్త పాలాది చంద్రమౌళేశ్వర్ కొంత విక్రయించారు. ఈ క్రమంలో ౨౦౨౨ సంవత్సరంలో నా భర్త అనారోగ్యంతో మరణించారు.

దీంతో ఆ భూమి నా పేరుపై మార్పిడి చేసుకున్నా. ఈ విషయా న్ని గమనించిన జడ్చర్లకు చెందిన సాంబశివలింగం, సురేష్, పవన్‌కుమార్‌గౌడ్.. మా ఇంటికి వచ్చి మాయమాటలు చెప్పి ౫౧ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు రూ. ౧.౫౦ కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం మాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కేవలం రూ.౩౦ లక్షలు మా ముందు పెట్టి మాకు తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. 

 వాస్తవానికి చలువగాలి రాఘవేందర్‌రాజు అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు. అతను మా ఇంటికి ఎప్పుడూ రాలేదు. కానీ అగ్రిమెంట్‌లో సాంబశివలింగం, సురేష్, పవన్‌కుమార్ అనే వ్యక్తులు అతని పేరును కూడా చేర్చారు. రాఘవేందర్‌రాజు పేరును వద్దు అని అప్పట్లోనే చెప్పాం. కానీ, వారు ఏమీ కాదని పేరును చేర్చారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో కూడా రాఘవేందర్‌రాజు మా ముందుకు రాలేదు.

మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ బ్లాక్‌మెయిల్ చేస్తూ రాఘవేందర్‌రాజును తెరపైకి తెచ్చారు. నాకు సీఎం లెవల్‌లో పలుకుబడి ఉంది. మహబూబ్‌నగర్‌లో నేను ఏమీ చెప్పినా కాదు అనేవారు లేరు. ‘మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌నే మట్టి కర్పించాను’ అనే మాటలతో మమల్ని తీవ్రస్థాయి లో భయభ్రాంతులకు గురిచేశారు. మీకు మిగిలిన డబ్బులు ఇవ్వం మీ పేరుపై ఉన్న ౩ ఎకరాల భూమిని నా పేరున ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలి.

లేదంటే మిమల్ని చంపేస్తా అంటు బెదిరింపులకు దిగారు. మా ఇంటి చుట్టూ తన రౌడీలను నిఘా పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తూ నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై గత ఏడాది మహబూబ్‌నగర్ ఎస్పీతోపాటు సీఐ, ఎస్సైలకు ఫిర్యాదు చేసినా, వారు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో అతను తన ప్రతాపాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్లారు’. 


ఇచ్చింది కొంతే..

‘భూమి కోసం మాకు ఇచ్చింది కొంత డబ్బే. కానీ, మార్కెట్ విలువ ప్రకారం రూ. ౧౦ కోట్లకు పైగా విలువ అయిన భూమి ని రాఘవేందర్‌రాజు బలవంతంగా లాక్కుకున్నాడని’ బాధితురాలు కళావతి వాపో యింది. ‘మాతో చేసుకున్న ఒప్పందం లో చెప్పినట్టు మిగతా డబ్బులు ఇవ్వకుండా మాపైనే బెదిరింపులకు పాల్పడుతూ తప్పు డు కేసులు బనాయించారు. పోలీసులు, రా జకీయ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి వే ధింపులను గురిచేస్తున్నారు.

అక్కడితో ఆగకుండా తమపై ఏకంగా ఆరు ఆక్రమ కేసుల ను నమోదు చేయించారు. హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేయాలని నిబం ధనల ప్రకారం తాము గత మూడు వారాలుగా సంతకాలు చేసి వచ్చాం. ఈ నెల ౪న ఆఖరి వారం సంతకాలు చేసేందుకు మేము కారులో మహబూబ్‌నగర్‌లోని రూరల్ పో లీస్‌స్టేషన్‌కు వెళ్లాం.

పోలీస్ స్టేషన్‌లో సంతకాలు చేసి తిరిగి వస్తుండగా మహబూబ్‌న గర్ దాటిన తరువాత మయూరీ పార్కు స మీపంలో దాదాపు ౩౦ మందికి పైగా రౌడీలతో కాపుకాసిన రాఘవేందర్‌రాజు.. సినిమాను తలపించేలా మా కారును అడ్డగించి మాపై విచక్షణ రహితంగా దాడి చేశారు. నన్ను, నా కుమారులను వాళ్ళ వాహనంలో ఎక్కించుకుని తాటికొండ గ్రామంలో ఉన్న రాఘవేందర్‌రాజు ఫాం హౌస్‌కు తీసుకుపోయారు.

అక్కడ ౩ గంటల పాటు మమల్ని చిత్రహింసలు పెట్టి, నా కుమారుల మెడపై కత్తులు పెట్టి రిజిస్ట్రేషన్ చేయకుంటే నీ కుమారులను చంపేస్తామని బెదిరించారు. నన్ను బలవంతంగా వారి కార్లో మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుని, మూడు ఎకరాల ౫ గుంటల భూమి వారి పేరుపై మార్చుకున్నారు.

ఈ విషయా న్ని ఎక్కడైన చెబితే నిన్ను, నీ కుమారులను చంపేస్తామని తీవ్ర స్థాయిలో భయపెట్టారు. రాత్రి ౮ గంటల వరకు వాళ్ళ ఫాంహౌస్‌లో చిత్రహింసలు పెట్టి వదిలివేశారు. అక్కడ నుంచి మేము మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చాం. నేరుగా సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు తీసుకోలేదు.

దీంతో డయల్ ౧౦౦కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశా’మని కళావతి తెలిపారు. తమ భూమిని అన్యాయంగా కాజేసిన రాఘవేందర్‌రాజుపై కఠిన చర్యలు తీసుకుని భూమిని ఇప్పించాలని కోరింది. రాఘవేందర్‌రాజు నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసు లను కోరారు. ఈ విషయమై డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినట్టు కళావతి తెలిపారు.

పాలకొండ ఘటనతో ఉలిక్కిపాటు 

తమను కిడ్నాప్ చేసి తమ భూమిని లాక్కున్నారని చలువగాలి రాఘవేందర్‌రాజుపై బాధితురాలు పాలాది కళావతి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాలమూరులో ఒక్కసారిగా కలకలం రేపింది. విలువైన భూముల పట్టాదారులకు సరైన రక్షణ లేక ఇబ్బందులు పెడుతూ బలవంతంగా భూములు లాక్కుంటున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు అవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రజాపాలనలో ప్రజలను పాలకులే ఇబ్బందులు పెడుతుంటే అరికట్టేది ఎవరంటూ బాధితులు వాపో తున్నారు. ఇటీవల ఇటుకబట్టీ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి కూడ తన భూములు ఇతరులు లాక్కుంటున్నారని, డీజీపీతోపాటు ఉన్నత అధికారులకు ఫిర్యాదులు చేసిన దాఖలాలు ఉన్నాయి. దీంతోపాటు కోర్టును సైతం అశ్రయించారు. వరుసగా పాలమూరు భూముల వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.