08-05-2025 12:00:00 AM
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు
ఆర్మూర్, మే 7: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎసిపి పుష్పం కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మాదక ద్రవ్యాలను మరియు కల్తీ కల్లు పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. కల్తీ కళ్ళు తాగడం వల్ల జీవితాలు పాడవుతున్నాయన్నారు ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలను సేవించవద్దని యువత మాదక ద్రవ్యాలతోనే మానసిక అనారోగ్యాలకు కారణం అవుతున్నారు అన్నారు.
కావున యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సమాజాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదాన్ని కలిగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలు తల్లిదండ్రులు సమాజం మొత్తం కలిసి ఈ ముప్పును ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్లు రెడ్డి, ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ఎక్సైజ్ శాఖ సీఐ అంజిత్ రావ్, హెల్త్ సెంటర్ వైద్యులు, పాల్గొన్నారు.