calender_icon.png 6 August, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

1.05 లక్షల కోట్లు

06-08-2025 01:07:15 AM

అసలు, వడ్డీ కలిపి ‘కాళేశ్వరం’ రుణాలు 

రుణాలపై కమిషన్ వ్యాఖ్యలు

  1. వడ్డీలకే రూ. 48,138 కోట్లు
  2.    2022 మార్చి నాటికి రుణాలు 87,449.15 కోట్లు
  3.    2024 సెప్టెంబర్ నాటికి చెల్లించింది రూ. 29,737 కోట్లు
  4. రాష్ట్ర బడ్జెట్‌పై భారం తప్పదంటూ అభిప్రాయపడ్డ కమిషన్  

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): “కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్యారంటీతో భారీగా నిధులను రుణాలుగా తీసుకొచ్చారు. కానీ ఈ మొత్తం ఎలా చెల్లిస్తామనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. పైగా ఆదాయాన్ని ఎలా రాబట్టుకుంటామనేదానిపై కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లి. (కేఐపీసీఎల్) బోర్డుకు, సభ్యులు గాలికి వదిలేశారు.

అంతిమంగా రాష్ట్ర బడ్జెట్‌పై ఈ భా రం పడకమానదు” అంటూ కాళేశ్వరం ప్రా జెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై విచారణ చేసిన జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో పొందుపర్చిన అభిప్రా యం ఇది. సాంకేతిక, ఆర్థిక అంశాలపై లో తుగా విచారణ చేసిన కమిషన్.. తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులపైకూడా స్పష్టంగా చెబుతూ.. ఎంత తెచ్చా రు? ఎంత కట్టారు? ఇంకా ఎంత కట్టాల్సి ఉందనేది స్పష్టం చేశారు. 

రూ. 87,449.15 కోట్ల రుణాలు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పుల రూపంలో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొ రేషన్ లి. (కేఐపీసీఎల్)తో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తను గ్యారంటీగా ఉంటూ 2022 మార్చి నాటికి రూ. 87, 449.15 కోట్లను రుణాలుగా తీసుకొచ్చింది.

అంటే 2022 మార్చిలో సవరించిన ప్రాజెక్టు వ్యయం అంచనాలకు పరిపాలనా అనుమతులు ఇచ్చిన.. రూ. 1,10,248.48 కోట్లలో.. రుణాలుగా తీసుకొచ్చింది (2022 మార్చి నాటికి) 79.32 శాతం కావడం గమనార్హం. మిగిలిన రూ.22,799.33 కోట్లు రాష్ట్ర ప్రభు త్వం బడ్జెట్‌లో గాని, ఇతర మార్గాల్లో గాని కేటాయించినట్టుగా కనపడుతోంది.

మరో రూ. 1.05 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉంది

2024 సెప్టెంబర్ నాటికి పరిస్థితిని పరిశీలించిన కమిషన్.. ఇప్పటివరకు అసలు, వడ్డీ రూపంలో చెల్లించిన రూ.29,737.06 కో ట్లు పోగా.. చెల్లించాల్సిన అసలు మొత్తం రూ.64,212.78 కోట్లు ఉన్నట్టుగా తేల్చి చెప్పింది. దీనికి అదనంగా వడ్డీ రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ. 41,638 కోట్లు ఉన్నట్టుగా అంచనా వేసింది.

అంటే ఇప్పటికే చెల్లించిన వడ్డీ రూ.6,500 కోట్లు కలుపుకుంటే.. మొత్తం వడ్డీగా చెల్లించేది దాదాపుగా రూ. 48,138 కోట్లు. ఈ లెక్కన కాళేశ్వరం ప్రాజెక్టుకు తెచ్చిన రుణంలో ఇప్పటికీ (20 24 సెప్టెంబర్ నాటికి) చెల్లించాల్సిన అసలు, వడ్డీ కలుపుకుని మొత్తం రూ. 1,05,850.78 కోట్లు ఉంటుందని కమిషన్ గణాంకాల్లో కాళేశ్వరం భారాన్ని స్పష్టంగా పేర్కొంది.

ఇం త భారీగా చేసిన అప్పులు తీర్చేలా ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటారనే అంశా న్ని కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డు, బోర్డు స భ్యులు ఎప్పుడో వదిలేశారంటూ కమిషన్ కాస్త ఘాటుగానే చెప్పింది. అంతిమంగా రా ష్ట్ర బడ్జెట్‌పై ఈ భారం పడక మానదంటూ కూడా కమిషన్ చెప్పడం గమనార్హం.

రూ. 48 వేల కోట్లకుపైగా వడ్డీలే

కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లి.(కేఐపీసీఎల్)ను ఏర్పా టు చేసిన ప్రభు త్వం.. తానే గ్యారంటీగా ఉంటూ.. 2022 మార్చి నాటికి చేసిన రూ. 87,449.15 కోట్ల రుణాలకు మొత్తం కట్టాల్సిన వడ్డీయే రూ. 50 వేల కోట్లకుపైగా ఉంటుందని కమిషన్ చెప్పిన అంకెలను బట్టి అర్థమవుతోంది. సెప్టెంబర్ 2024 నాటికి పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రాజెక్టు కోసం తెచ్చిన మొత్తం రుణా లకు అసలు, వడ్డీ కలిపి చెల్లించిన మొత్తం రూ. 29,737.06 కోట్లుగా కమిషన్ తేల్చి చెప్పింది. అంటే ఇందులో సుమారు రూ. 23,236 కోట్ల వరకు అసలు ఉండగా.. వడ్డీ గా రూ.6,500 కోట్లకుపైగా చెల్లించినట్టు కమిషన్ ఇచ్చిన నివేదికలో పొందుపర్చిన గణాంకాలను బట్టి అర్థమవుతోంది.

రెండుసార్లు పెంచిన అంచనాలు

వాస్తవానికి ప్రాథమిక దశలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం మొత్తం రూ. 38,500 కోట్లుగా మొదట్లో అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ తరువాత అప్పటి సీఎం.. ప్రధానమంత్రికి లేఖ రాస్తూ ప్రాజెక్టు వ్యయం రూ. 71,436 కోట్లకు పెరిగిందని స్పష్టంగా రాసినట్టు కమిషన్ పేర్కొంది. ఆ తరువాత సవరించిన అంచనాలకు 2022 మార్చిలో పరిపాలనా అనుమతులు ఇస్తూ.. రూ. 1,10,248.48 కోట్లుగా అప్పటి ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది.