calender_icon.png 24 January, 2026 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలి

24-01-2026 09:39:49 PM

-  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్,(విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని అరైవ్-అలైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గౌరవ డీజీపీ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్-అలైవ్ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా అమలు అవుతోందని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 22 కోట్ల 10 లక్షల బైక్లు ఉన్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు తలకి గాయం కాకుండా ఉంటే ప్రాణాపాయం తప్పుతుందని గుర్తుచేశారు.

వాహనదారులు వ్యక్తిగత భద్రత పాటిస్తూనే ఇతరులను కూడా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న వారికి పోలీస్ శాఖ తరపున హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ట్రైనీ ఐపీఎస్ సోహం, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, తిరుమల్, తదితరులు పాల్గొన్నారు.