calender_icon.png 12 August, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా లైబ్రేరియన్ డే వేడుకలు..

12-08-2025 07:54:30 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ బాలుర కళాశాల(Tribal Welfare Residential Degree Boys College)లో మంగళవారం లైబ్రేరియన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కె.భవానీ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. 2024-25 విద్యా సంవత్సరంలో లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్లో ఇద్దరు విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీలో పిజి అడ్మిషన్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. వైస్ ప్రిన్సిపల్ బి.లావణ్య పుస్తక పఠనం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ డాక్టర్.వేముల అనిల్ కుమార్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్షకై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రరీయన్ వడ్లకొండ రజిత, అధ్యాపక బృందం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.