calender_icon.png 21 August, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురునానక్‌లో ఒరియెంటేషన్ డే

21-08-2025 01:45:16 AM

కొత్త విద్యార్థులకు స్వాగతం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): గురునానక్ విద్యాసంస్థలలో 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త విద్యార్థుల కోసం బుధవారం ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహిం చారు. నూతన విద్యార్థులు, వారి తల్లితండ్రులు హాజరయ్యారు. ప్రయాగ్ కన్స్యూమ ర్ కేర్ సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ కృతివాసన్ ఎస్, నోబుల్ ‘క్యూ’ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ పెరుగు మాట్లాడారు.

వారి విస్తృత పరిశ్రమ అనుభవం ఆధారంగా వారు విద్యార్థులకు ప్రేరణాత్మకంగా ప్రసంగిస్తూ, ఉన్నత లక్ష్యాలు పెట్టు కోవాలని, నిరంతర విద్య మరియు ఆవిష్కరణపై దృష్టి పెట్టాలని సూచించారు. గురు నానక్ విద్య సంస్థల వైస్ చైర్మన్, గురునానక్ యూనివర్సిటీ చాన్సలర్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ అధ్యక్షత వహించారు.

గురు నానక్ ఇన్‌స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, గురునానక్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ హెచ్ ఎస్ సైనీ విద్యా ప్రణాళిక, పరిశోధన అవకాశాలు, విద్యార్థుల అభ్యున్నతికి సంస్థ చేపట్టిన కార్యక్రమాలపై విశ్లేషణా త్మకంగా ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్ శ్రీనాథరెడ్డి, డైరెక్టర్, గ్నిటీసీ, డాక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ, డైరెక్టర్, జీఎన్‌ఐటీ, డాక్టర్ పి. పార్థసారధి, జాయింట్ డైరెక్టర్, డాక్టర్ కె. వెంకటరావు, ప్రిన్సిపల్, డా. రిషి సయాల్, అసోసియేట్ డైరెక్టర్, డాక్టర్ ఎస్‌వి. రంగనాయకులు, డీన్ ఆర్ అండీ డీ, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కేదార్నాథ్, డాక్టర్ భాస్కర్, విజయలక్ష్మి, మొదటి సంవత్సరం కోఆర్డినేటర్లు, వినయ్ చోప్రా పాల్గొన్నారు.