calender_icon.png 21 August, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగర పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

21-08-2025 01:46:12 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని యూసుఫ్‌గూడ సర్కిల్‌లో బోరబండ కుంట, సున్నం చెరువు, ఎస్‌పిఆర్ హిల్స్, కార్మికనగర్ పీటీ పాయింట్, రహ్మత్‌నగర్, జానకమ్మతోట, నవీన్‌నగర్ ప్రాంతాలలో జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు,

హెల్త్ శానిటేషన్ అదనపు కమిషనర్ సిఎన్ రఘుప్ర సాద్, సర్కిల్ అధికారులతో కలిసి పర్యటించారు.  వర్షాలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు సానిటేషన్ బృందాలకు నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఆరోగ్యకరమైన నగర నిర్మాణమే లక్ష్యంగా మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. పారిశుద్ధ్య డ్రైవ్‌కు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.

మరోసారి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను ఈ నెల 21నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. గతంలో నిర్వహించిన వర్షాకాల శానిటేషన్ డ్రైవ్‌లు మంచి ఫలితాలను ఇవ్వడంతో, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉం చుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయ న పేర్కొన్నారు.

ఈ రోడ్డు సేఫ్టీ కార్యక్రమాలను కూడా ముమ్మరంగా చేపడుతున్నా మని చెప్పారు. ఇప్పటి వరకు గుర్తించిన 11,741 పాట్‌హోల్స్‌లో 8,330 మరమ్మత్తులు పూర్తి చేయగా, అదనంగా 434 క్యాపిట్స్‌ను మరమ్మతు చేసి, అవసరమైన చోట 232 కవర్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.