calender_icon.png 3 August, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టు తత్వశాస్త్రంలో సనాతన మూలాలు

03-08-2025 12:14:25 AM

సర్వప్రాణి నమూనా సనాతన ధర్మం ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతిస పండితః  - భగవద్గీత 6.32 (సకలభూతాలలో తనను చూసేవాడు, తనలో సమస్త భూతాలను చూసేవాడు పండితుడు) అధర్మస్య వినాశాయ, కర్తవ్యమ్యుద్ధమేవహి (అధర్మ వినాశనానికి, యుద్ధం చేయడం నీ కర్తవ్యం) కమ్యూనిస్టు తత్వం కార్మికులకు దేశం, ప్రాంతం లేదు. పోరాడితేపోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప  కమ్యూనిస్ట్ మేనిఫెస్టో

విశ్లేషణ: గీత సమస్త జీవుల్లోఆత్మసామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. జాతి, కుల, తరగతిలాంటి భేదా లకు అతీతంగా. మార్క్సుసామాజిక సమాన త్వాన్ని నినాదంగా చేసి, వర్గాల మధ్య అంతరాలను చెరపటానికి ప్రయత్నం. ఒకరు ఆధ్యాత్మిక విప్లవ మార్గాన్ని చూపితే, మరొకరు విప్లవ మార్గాన్ని చూపిస్తారు.

శూన్య సంపద స్వామితం (వ్యక్తి సంపద నిర్మూలన)

సనాతన ధర్మం: ఈశావాస్యమిదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ - ఈశావాస్యోపనిషత్ 1 (ఈ సర్వ జగత్తూ ఈశ్వరుని చేత ఆవహించబడి ఉంది. స్వార్థంతో కాక, త్యాగంతో ఆస్వాదించు)

కమ్యూనిస్టు తత్వం: కమ్యూనిజాన్ని తాత్త్వికంగాచెప్పాలంటే - ప్రైవేట్ ప్రాపర్టీ నిర్మూలన కార్ల్‌మార్క్స్

విశ్లేషణ: ఉపనిషత్తులు యాజమాన్యాన్ని ధిక్కరిస్తూ త్యాగాన్ని గుణంగా చూస్తాయి. నిశ్శ్వామిత సంపన్నం శ్రేష్ఠం, అంటే స్వార్థం లేని సంపద శ్రేష్ఠం అని అర్థం. మార్క్స్ సంపతి ్తయాజమాన్యమే దోపిడీ మూలం అంటాడు. రెండూ అధిక హక్కుల ప్రబలతను తిరస్కరిస్తాయి. -ఒకటి ఆధ్యాత్మికంగా, మరొకటి సామాజికంగా.

శ్రమే శ్రేష్ఠ భావ 

సనాతన ధర్మం: కర్మణా జాయతే వంశఃకర్మణా విపులం ధర్మః కర్మణా లభతే కీర్తిం, కర్మణా లభతే యశః (కర్మ ద్వారానే వంశం వికసిస్తుంది. కర్మ ద్వారానే ధర్మం అభివృద్ధి చెందుతుంది కర్మ ద్వారానే కీర్తి లభిస్తుంది. కర్మ ద్వారానే యశస్సు వస్తుంది.)

కమ్యూనిస్టు తత్వం: ‘లేబర్ అనేదే సంపదకు మూలం.’  కార్ల్‌మార్క్స్ ‘శ్రమ ద్వారానే మనిషి జంతువుల స్థితిని అధిగమిస్తాడు’ ఫెడ్రిక్  ఎంగెల్స్

విశ్లేషణ: సనాతన ధర్మంలో కర్మ యోగం శ్రమను మోక్షానికి మార్గంగా చూపిస్తుంది. మార్పు దానిని మనిషి సృజనాత్మకతగా చూస్తాడు. ఒకటి స్వాత్మానందానికి, మరొకటి సమాజ విముక్తికి. యుద్ధం చేయడం నీకర్మ కర్తవ్యమ్ అర్జున అనే శ్రీకృష్ణుడు ఎప్పుడో బోధించా డు, దానిని వివిధ తత్వాలకు స్ఫూర్తి అయ్యింది.

సమాజ హితార్థం (లోక సంగ్రహం) 

సనాతన ధర్మం: లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమరసి - భగవద్గీత 3.20 (సమాజ హితం కోసం, సామజిక సంక్షే మం కోసం, నీవు నీ బాధ్యత నిర్వహించాలిసిందే) శక్త్యనుసారం దదాతు జనః,ఆవశ్యకతానుసారంప్రాప్నుయాత్? ఏష ధర్మః, ఏష యోగః, ఏష సమత్వం (ప్రతి మనిషి తన శక్తికనుగుణంగా ఇవ్వా లి. ప్రతిఒక్కరు తమ అవసరాల అనుగుణంగా పొందాలి. ఇదే ధర్మం, ఇదే యోగం, ఇదే సమానత్వం.)

కమ్యూనిస్టు తత్వం: ‘ప్రతిఒక్కరి సామర్థ్యాన్ని బట్టి, ప్రతిఒక్కరికీ అవసరాల మేరకు’ కార్ల్‌మార్క్స్

విశ్లేషణ: కృష్ణుడు లోక సంగ్రహాన్ని ధర్మ కర్తవ్యంగా పేర్కొన్నాడు. మార్క్సు అవసరాలపై ఆధారపడిన పునర్వితరణను ప్రతిపాదించాడు. వ్యక్తిగత లాభం కాక, సమాజ ప్రయో జనం లక్ష్యం.

ప్రీతిష్ఠధిక్కారం

సనాతన ధర్మం: బ్రిదారణ్యక ఉపనిషద్ 3.9. 26 నేతి - నేతి (ఇది కాదు.. అది కాదు.. గుడ్డిగా నమ్మ డం కాదు, ప్రశ్నించాలి, పరీక్షించాలి, ప్రయత్నించాలని అర్థం.) చాందోగ్య ఉపనిషద్ 6.14. 2 శ్రద్ధాస్తవష్యత్, విచారః కురుస్వా నమ్ము, కానీ ప్రశ్నించు

కమ్యూనిస్టు తత్వం: మతం సమాజానికి మత్తు మందులాంటిది  కార్ల్‌మార్క్స్ (బుద్ధిహీన ప్రపంచానికి ఆధారం)

విశ్లేషణ: అబ్రహం మతాలు అయిన జుడాయి జం, క్రిస్టియానిటీ, ఇస్లాం ఒక విధంగా ధా ర్మికం కంటే, నియమ, నిబంధనలతో కూ డిన సైనిక విధానం. అక్కడ ప్రజల అభిప్రా యం ఉండదు, కేవలం అనుకరణ మాత్ర మే. అదే సనాతన ధర్మం ఒక జీవనవిధానం. నియమ, నిబంధనలు ఉండవు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు మూలం “ప్రశ్నించు.. చర్చించు” సనాతన ధర్మ భావాల మూలం.

ఆర్థిక సమతుల్యత 

సనాతన ధర్మం: ధర్మశాస్త్ర 8.94 ప్రకారం.. “ధనం ధర్మార్థం సంపాద్యం, తత్ పశ్చాత్ ఆపది” (ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించాలి. ఆ తరువాత, ఆ సంపాదించిన ధనాన్ని అవసరమైన సందర్భాల్లో, ముఖ్యంగా ఇతరుల బాధాకర సమయంలో, దానం చేయాలి) విష్ణుస్ప్రితి 1.24  ధర్మాయైవతదర్పయేత్’ (ధర్మ బద్ధంగా ధనాన్ని సంపాదించాలి. ఆ ధనాన్ని కూడా తిరిగి ధర్మ సంబంధమైన కార్యాలకు వినియోగించాలి)

కమ్యూనిస్టు తత్వం: ప్రొలెటేరియట్ తన రాజకీయ అధికారం ద్వారా బూర్జువాల చేతిలో నుంచి సంపత్తిని స్వాధీనం చేసుకుంటుంది’  కమ్యూనిస్టు మ్యానిఫెస్టో

విశ్లేషణ..

ధర్మం దానం, యజ్ఞం, భిక్షవంటి త్యాగ విధానాలను ప్రతిపాదిస్తుంది. మార్క్సు ఉ ద్యమం ద్వారా పునర్వితరణను కోరుకుంటా డు. రెండు మార్గాలూ ధనాన్ని కిందకు ప్రవహించేటట్లు చేస్తాయి.

రాజ్య రహిత  వర్గ రహిత సమాజం

సనాతన ధర్మం: మహా ఉపనిషద్ 6.72 అయం నిజ, పరో వెతి గణనాలఘుచేతసమ్ ఉదార చరితానాం తూ వసుధైవ కుటుంబకం (ఇదినాది, అది నీది.. అనేది గుణ సంకుచిత మనస్తత్వం, విశాలమైన మనస్తత్వం, ‘ప్రపంచమంతా ఒకటే కుటుంబం’)

కమ్యూనిస్టు తత్వం: ‘రాజ్యాంగం క్రమంగా అశక్తమవుతుం ది’ ఫెడ్రిక్- ఎంగెల్స్ (ఇది పాలకులు - పాలితులలేని సమాజం)

విశ్లేషణ: రెండూ రాష్ట్రీయనియంత్రణ కన్నా మానవీయ నీతి ఆధారంగా నడిచే సమాజాన్ని ఆకాంక్షించాయి. ఒకటి రామరా జ్యంగా, మరొకటి సోషలిస్టుగా..

విప్లవాత్మకకర్తవ్యమ్

సనాతనధర్మం: ‘యుద్ధాయ కృత నిశ్చయః” - భగవద్గీత 2.37  (న్యాయానికి యుద్ధం చేయమని నిశ్చయించు.) భగవద్గీత  4 యదా యదా హి ధర్మస్యగ్లానిర్భవతి భా రత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృ జామ్యహమ్ (భారత ధర్మం లోపించునప్పుడు, అధర్మంపెరిగినప్పుడు, అప్పుడు నేను అవతరిస్తాను) శాస్త్రేణ రక్ష్యతే ధర్మః ధర్మాన్ని ఆయుధంతో రక్షించవలె

కమ్యూనిస్టు తత్వం: “ఆలోచన శస్త్రాలే కాదు.. నిజమైన శస్త్రాలతో పోరాటం అవసరం”  కార్ల్‌మార్క్స్

విశ్లేషణ: గీతలో కృష్ణుడు ధర్మ రక్షణ కోసం సమరానికి ఆహ్వానం పలికాడు. మార్క్స్ అణచి వేతను తుడిచివేయడానికి విప్లవ శక్తిని కోరాడు. రెండు మార్గాలూ న్యాయం కోసం యుద్ధం- లక్ష్యం ఒక్కటే, మార్గం ఒక్కటే, కేవలం పేరు రంగు, పేర్లు మాత్రమే వేరు.

జాతి అతీతమైన ఐక్యత

సనాతన ధర్మం: రుగ్వేద 10.191.2-4 సంగ చ్ఛధ్వం సం వదధ్వం సం వో మ నాంసి జానతామ్. దేవా భాగం యథా పూ ర్వే సంజానానా ఉపాసతే. సమానీ వ ఆకూ తిః సమానా హృదయానివః. సమానం అ స్తువో మనో యథావః సుసహా సతి (మనం కలిసి నడుద్దాం. కలిసి మాట్లాడు కుందాం, మన మనసులు ఒకటిగాఉండాలి. ఎలా పురాతన దేవతలు కలిసి పూజలు చేసేవారో అలా మనమూ కలిసి పోవాలి. మన ఆశయాలు ఒకటే కావాలి, మన హృదయా లు ఒకటిగా ఉండాలి. మనమనసులు ఒకే తీరుగా ఉండాలి. అప్పుడు మనం సుఖంగా కలిసి జీవించగలం)

కమ్యూనిస్టు తత్వం: ‘ప్రపంచ కార్మికులారా ఏకమవుదాం’ - కమ్యూనిస్ట్ మేనిఫెస్టో

విశ్లేషణ: మార్క్స్ వర్గ ఐక్యతకు పిలుపిస్తే, ధర్మం విశ్వ కుటుంబ భావనను ప్రకటిస్తుంది. రెం డూ జాతి, మత, ప్రాంత భేదాలను తిరస్కరించి మానవత్వాన్ని కేంద్రంగా ఉంచా యి. అదే సనాతన ధర్మం గొప్పదనం.

అంతర్మూలమైన విప్లవం

సనాతన ధర్మం: “ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్‌”  భగవద్గీత 6.5 (తననుతానె ఉద్ధరించుకోవాలి. దిగజార్చ కూడదు)

కమ్యూనిస్టు తత్వం: “మనుషులు తాము ఎంచుకోని పరిస్థితుల్లోనే చరిత్రను నిర్మిస్తారు’  కార్ల్‌మార్క్స్

విశ్లేషణ: రెండూ వ్యక్తిగత ఉత్తేజనను ప్రాధాన్యం గా పేర్కొంటాయి. ధర్మంలో అది ఆధ్యా త్మిక స్వేచ్ఛకు మార్గం. మార్క్సులో అది కార్మిక చైతన్యం ద్వారా సామాజిక విప్లవానికి మార్గం. మార్గమేది అయినా లక్ష్యం ఒక్కటే.

..ఇది చాలామందికి తెలియని, కానీ చాలా నిగూఢమైన నిజం. కమ్యూనిజం అనే భావజాలానికి బలమైన మూలాలు భారతీయతత్వ శాస్త్రంలోఉన్నాయి. కార్ల్‌మార్క్స్, ఫెడ్రిక్ ఎంగె ల్స్ ఆలోచనల్లో వారి గురువుగా ఉన్న హేగెల్ ఒక భారత తత్వశాస్ర ్తవిద్యావేత్త (ఇండాలజిస్ట్). ఆయన వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధతత్వాలు మొదలైన వాటిపై అధ్యయనం చేసినవారు.

ఆయనతత్వవాదంలో కనిపించే ‘థీసిస్ -యాంటీ థీసిస్ -సింథసిస్’ అనే త్రికరణ శక్తి భావన భారతీయ తత్వంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. హెగెల్ ఆధారంగా మార్క్స్, ఫెడ్రిక్ ఎం గెల్స్ డైలెక్టికల్ మెటీరియలిజాన్ని ఆత్మతత్వాన్ని తిరగదోసి, వారు భౌతికత వైపు మొగ్గారు. కానీ తత్వపద్ధతిని మాత్రం కొనసాగించారు. కమ్యూనిస్టు మేనిఫెస్టోలో కనిపించే వర్ణ వ్యవస్థ వ్యతిరేకత, సమానత్వం,

కర్మను ఫలాభిలాష లేకుండా చేయడం వంటి విషయాలు ధార్మిక భారతీయ తత్వానికి ప్రతీక. అందువల్ల, కమ్యూనిజం నిర్మాణం సనాతన ధర్మ భావాల నుంచి స్పూర్తి పొందినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సనాతన ధర్మం ద్వారా హెగెల్, తన ద్వారా మార్క్స్ ఆవిర్భవించిన విప్లవ జ్వాల వెనుక భారతీయ ధర్మ శాస్త్రజ్వాల మూలం. ఇది సనాతన ధర్మ ఆధ్యాత్మిక డీఎన్‌ఏ నుంచి ఉద్భవించిన భౌతిక సిద్ధాంతం కమ్యూనిజం.