03-08-2025 12:07:00 AM
మహారాష్ట్రలోని మాలెగావ్‌లో సరిగ్గా 17 ఏళ్ల క్రితం రంజాన్, న వరాత్రి ఉత్సవాల సమయంలో జరిగిన విషాదకర సంఘటనలో ఆరుగురు మృతిచెందారు. అంతేకాకుండా వందలాది మంది గాయ పడ్డారు. ఘటన వెనుక కారణాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన ఒక్కో దర్యాప్తు సంస్థ మారుతూ వచ్చింది. న్యాయస్థానంలోనూ సుదీర్ఘ కాలం విచారణ సాగింది. ఐదుగురు న్యాయమూర్తులు కేసు పూర్వాపరాలను విచారించారు.
కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఏడుగురిని ముంబై ప్రత్యేక కోర్టు తాజాగా నిర్దోషులుగా ప్రక టించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు తీర్పు వెల్లడించింది. అయితే పేలుళ్లకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞాఠాకూర్‌దేనని.. ఆ బైక్ ఆమె పేరిటే రిజిస్టర్ అయిందని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వెల్లడించింది.
అనుమానం కొద్దీ ఎవరినీ దో షులుగా లెక్కించలేమని ప్రత్యేక కోర్టు తెలిపింది. ఉగ్రవాదానికి మతం లే దని కేసును విచారించిన ప్రత్యేక జడ్జి జస్టిస్ ఏకే లాహోటీ వెల్లడించారు. ఈ కేసుకు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) నిబంధనలు వర్తించవని తేల్చిచెప్పారు. ఏకే లాహోటీ తీర్పుతో ప్రజ్ఞా ఠాకూర్ సహా మి గతావారు హర్షం వ్యక్తం చేశారు.
మరి మాలేగావ్ కేసులో ఆరుగురిని చంపిన వారెవరు? పేలుడులో వాడిన బైక్ ఫలానా ఠాకూర్‌ది కానపుడు మరెవరిది? పేలుడుకు ఉపయోగించిన పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి?.. ఆరుగురి మృతికి బా ధ్యులెవరన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ఒక దుర్ఘటన జరిగినపుడు కేసులో దోషులెవరో తేల్చడం ముఖ్యమా? ఫలానా వారే దో షులు అవునా కాదా అనడం ముఖ్యమా? అన్నది చర్చనీయాంశమైంది.
అందరూ నిర్దోషులే అని ప్రకటించడం చూస్తే ఈ పదిహేడేళ్ల పాటు ఇటు నిందితుల సమ యం.. అటు కోర్టు, న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారుల విలువైన కా లం వృథా అయినట్టే కదా. మాలేగావ్ కేసు దర్యాప్తు చే సిన ఏటీఎస్‌లో పనిచేసిన మాజీ పోలీసు అధికారి మెహబూబ్ ముజావ ర్ తీర్పు సందర్భంగా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ని అరెస్టు చేయాల్సిందిగా తనను ఆదేశించారన్నారు.
భగవత్‌ను అరెస్ట్ చే యడం తన శక్తికి మించిన పని కావడంతో తాను ఆ పని చేయలేకపోయానని ముజావర్ పేర్కొనడం ఆసక్తి కలిగిస్తోంది. మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసు తీర్పు తనకు తీవ్ర నిరాశ కలిగించిందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. మతాన్ని లక్ష్యం చేసుకుని జరిగిన దాడి కేసు ద ర్యాప్తులో ప్రాసిక్యూషన్ ఉదాసీన వైఖరి ప్రదర్శించినట్టు అర్థమవుతోంద న్నారు.
ముంబై రైలు పే లుళ్ల కేసులో నిందితుల విడుదలపై తక్షణమే స్టే కోరిన మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు మౌనం ఎందుకు ప్రదర్శిస్తున్నా యో చెప్పాలని ని లదీశారు. మాలేగావ్ ఘటన చోటు చేసుకున్న మాట నిజం. వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సి రావడం నిజం. ఇన్ని నిజాలు ఉన్నచోట దోషుల ఎక్కడనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇలాగైతే బాంబు పేలుళ్లలో మృతిచెందిన కుటుంబాలకు న్యాయం ఎప్పుడు దక్కుతుందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది.