01-08-2025 01:32:59 AM
- యూఎస్ కాన్సులేట్ సందర్శకులకు తప్పనున్న తిప్పలు
- ‘తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియా’
- ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): తమ ప్రభుత్వం వేసే ప్రతి అడుగు తెలంగాణ ప్రజల కోసమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రాంగణంలో రూ.1.5 కోట్లతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) అత్యాధునిక వసతులతో నిర్మించిన ‘తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియా’ను ఆయన గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సు లేట్‌కు ప్రతిరోజూ 3 వేల మందికి పైగా సందర్శకులు వస్తుంటారని, వేచి చూసేందుకు సరైన సౌకర్యాలు లేక ఇక్కడికొచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఎక్కడెక్కడె ఏం అవసరమో గుర్తించి, అందుకు అనుగుణంగా అ త్యాధునిక వసతులతో కూడిన వెయింటింగ్ ఏరియాను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కేవలం పారిశ్రామిక, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు ఇది నిదర్శనమని వివరించారు.
30 వేల కొత్త ఉద్యోగాలు సృష్టి
తెలంగాణ మధ్య ద్వుపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంద మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రా నిక్స్, ఈవీ రంగాల్లో అమెరికా మన రాష్ట్రానికి అగ్రగామి వ్యాపార భాగస్వామి అని, మన ఐటీ ఎగుమతుల్లో 38 శాతం ఉత్తర అమెరికాకు జరుగుతున్నాయని స్పష్టం చేశా రు. గూగుల్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా ఉందని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఒక్క జనవరిలోనే అమెరి కా కంపెనీలు మన రాష్ర్టంలో రూ.31,500 కోట్ల పెట్టుబడులను పెట్టాయని, ఫలితంగా 30 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయని చెప్పారు. ఈ కొత్త వెయిటింగ్ ఏరియా ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో హైదరా బాద్ అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ తదితరులు పాల్గొన్నారు.
జెన్నిఫర్ లార్సన్‌కు ఆత్మీయ వీడ్కోలు
హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్‌గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్ లార్సన్‌కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెలంగాణ, అమెరికా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు.
విద్య, సాంస్కృతిక మార్పిడి, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యా న్ని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆమె అం దించిన సహకారం, దార్శనికతకు రాష్ర్ట ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజు ల్లోనూ తెలంగాణ, -అమెరికా మధ్య ద్వుపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా సహకారం అందించాలని కోరారు. ఆమె తదుపరి ప్రయా ణంలోనూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాక్షించారు.